వంగవీటి రాధాకు వంద కోట్ల బంఫర్ ఆఫర్ ! ప్రకటించింది ఎవరో తెలుసా ...?     2019-01-22   23:50:54  IST  Sai Mallula

కొద్ది రోజులుగా ప్రతిరోజు మీడియా లో కనిపిస్తూ… ఏపీకి తానే కాబోయే సీఎం అంటూ తెగ హడావుడి చేస్తున్నాడు. క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.అయితే పాల్ చెప్పే మాటలను సీరియస్ గా తీసుకునే వారికంటే… అతన్ని ఒక కమెడియన్ గా చూసేవారు ఎక్కువయ్యారు. ఇక విషయానికి వస్తే… వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధాను ఉద్దేశించి పాల్ సంచలన ఆరోపణలు చేశారు.

Praja Shanti Party Chief Ka Paul Bumper Offer For Vangaveeti Radha-Vangaveeti Radhakrishna Tdp Ysrcp Viajyawada Central Seat Asembly

Praja Shanti Party Chief Ka Paul Bumper Offer For Vangaveeti Radha

టీడీపీకి అమ్ముడుపోయి తప్పు చేయొద్దని, ఆత్మ బలిదానం చేసుకోవద్దు అంటూ… వంగవీటి రాధాకృష్ణను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. రాధా ప్రజాశాంతి పార్టీలో చేరితే విజయవాడ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తానని.. ఆ తర్వాత మంత్రిని చేస్తానని పాల్ హామీ ఇచ్చారు. ఒకవేళ తన హామీ నిలబెట్టుకోకపోతే.. వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు రూ. 100 కోట్ల విరాళం ఇస్తాను అంటూ … బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు.

Praja Shanti Party Chief Ka Paul Bumper Offer For Vangaveeti Radha-Vangaveeti Radhakrishna Tdp Ysrcp Viajyawada Central Seat Asembly

‘వంగవీటి రాధా గారూ మీ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. టీడీపీలో చేరి తప్పు చేయొద్దు. తండ్రిని చంపిన వారి వద్దకు వెళ్లి మీ ఆత్మను బలిదానం చేసుకోకండి. చంద్రబాబు నాయుడు పాలన అంతా అవినీతిమయం, కుటుంబ పాలన. ఎన్నికలంటేనే చంద్రబాబు గుండెల్లో గుబులు పుడుతోంది. ఆ పార్టీలో చేరితే మిమ్మల్ని కాపులు ఎన్నటికీ క్షమించబోరు’ అని కేఏ పాల్ అన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా తమ పార్టీలో చేరతానని హామీ ఇచ్చారని చెబుతూ పాల్ మరింత కామెడీ పంచారు.