శభాష్ రమేష్: ఎన్నికలు వాయిదా వేయకపోతే ఏం జరిగేదో ?  

Praises To Election Commissioner Nimmagadda Ramesh Kumar Corona Virus - Telugu Ap Election Commissioner, Nimmagadda Ramesh Kumar

కరోనా కరోనా ? ఎక్కడ చూసినా కరోనా హడావుడి.ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండడంతో ఎక్కడలేని ఆందోళన నెలకొంది.

 Praises To Election Commissioner Nimmagadda Ramesh Kumar Corona Virus - Telugu Ap Election Commissioner, Nimmagadda Ramesh Kumar-Political-Telugu Tollywood Photo Image

అసలు ఇప్పటికి వరకు ప్రపంచం ఈ విధంగా ఉలిక్కిపడలేదు.దేశమంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

ప్రజలు ఎవరూ ఇళ్ళల్లోనుంచి బయటకి వచ్చేందుకు ఇష్టపడడంలేదు.ఇక విదేశాల నుంచి ఎవరు వచ్చినా వారిని జనాల్లోకి రానివ్వడంలేదు.

శభాష్ రమేష్: ఎన్నికలు వాయిదా వేయకపోతే ఏం జరిగేదో - Praises To Election Commissioner Nimmagadda Ramesh Kumar Corona Virus - Telugu Ap Election Commissioner, Nimmagadda Ramesh Kumar-Political-Telugu Tollywood Photo Image

దేశమంతా ఈ విధంగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.పరిస్థితి ఈ విధంగా ఉండడంతో అసలు ఏపీలో ముందు విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించినా అవి కూడా ఇప్పుడు వాయిదా పడి ఉండేవి.

కానీ కేంద్రం ఆదేశాలతో ఏపీ ఎన్నికల కమిషనర్ ముందస్తుగానే ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

కరోనా వైరస్ కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో వైసిపి దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

అసలు ఏపీలో కరోనా వైరస్ ప్రభావం లేదని, కేవలం తెలుగుదేశం ప్రోద్బలంతోనే రమేష్ కుమార్ ఏపీలో ఎన్నికలను వాయిదా వేయించారని, ఆయన టిడిపి అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారు అంటూ వైసిపి విమర్శలు గుప్పించింది.అంతేకాదు రమేష్ కుమార్ కులాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు కూడా పెద్ద ఎత్తున చేశారు.

ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర కలకలం రేపింది.ఈ వ్యవహారంలో కేంద్రం హస్తం కూడా ఉందని వైసీపీ అనుమానించింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు రమేష్ కుమార్ పై సాక్షాత్తు ఏపీ సీఎం జగన్ కూడా విమర్శించారు.

చీఫ్ సెక్రటరీతో లేఖ కూడా రాయించారు.

దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన మూడు రోజుల్లోనే మొత్తం సీన్ అంతా మారిపోయింది.

దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో నిమ్మగడ్డ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు ఆయన పై ప్రశంసలు వస్తున్నాయి.అంతేకాకుండా ఏపీలో కరోనా వైరస్ లేదని, ముందుగా ప్రకటించినా ఏపీ సీఎం జగన్ స్వయంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందని, ఏపీ మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అసలు ఈ పరిస్థితి వస్తుందని ఏపీ ప్రభుత్వ పెద్దలకు ముందే సమాచారం ఉంది.అయితే ఏదో ఒక రకంగా ఎన్నికల ప్రక్రియను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో వీరంతా మద్దతుగా వ్యవహరించారు.

కానీ ఇప్పుడు జనాలు బయటకు వచ్చేందుకు ప్రభుత్వమే ఒప్పుకోవడం లేదు.దీంతో అసలు ఏపీలో ఎన్నికలు యధావిధిగా జరిగి ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా విజృంభించేది.

సభలు, సమావేశాలు, ప్రచారాలు ఇలా అనేకం ఏపీలో చోటు చేసుకుని కరోనా వ్యాప్తి మరింత విజృంభించేది.సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ నే దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడం ఈనెల ఆఖరి వరకు ఇదే పరిస్థితి ఉండేలా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడడం మంచిది అయ్యిందని, రమేష్ కుమార్ కాస్త ముందుగానే సరైన నిర్ణయం తీసుకున్నారనే వాదనను తెరమీదకు వస్తోంది.

మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అబాసుపాలు అవ్వగా ముందు నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నారు.

తాజా వార్తలు

Praises To Election Commissioner Nimmagadda Ramesh Kumar Corona Virus Related Telugu News,Photos/Pics,Images..