సోషల్ మీడియాలో పోలీసులు పెట్టిన పోస్ట్‌కి ప్రశంసలు.. ఎందుకంటే...

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పోస్టు వైరల్‌గా మారింది.ఈ పోస్ట్‌ను పోలీసులు షేర్ చేశారు.

 Praise For The Post Posted By The Police On Social Media Social Media, Viral Lat-TeluguStop.com

ఇది చూసిన నెటిజన్లు అందరూ పోలీసు అధికారులను పొగుడుతున్నారు.ఇంతకీ ఏంటా పోస్టు.? పోలీసులను ఎందుకు ప్రశంసిస్తున్నారు అనేది కదా మీ సందేహం, అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే.గత కొద్ది రోజులుగా న్యూయార్క్ సిటీలోని టైమ్‌ స్క్వేర్ ప్రాంతంలో తేనెటీగల బెడద మరింత పెరిగిపోయింది.

ఈ ప్రాంతంలో అనునిత్యం ప్రజలు తిరుగుతుంటారు.అయితే ఇంత రద్దీగా ఉన్న ప్రదేశంలోకి రెండువేల తేనెతీగలు రంగ ప్రవేశం చేశాయి.

అనంతరం ఇదే మా రాజ్యం అన్నట్లుగా అక్కడ ఇష్టానుసారం తేనె గూడులను ఏర్పాటు చేసుకున్నాయి.ఇవి మకరందం కోసం తరచూ బయటకి వెళ్తూ వస్తున్నాయి.

ఆ గూడు నుంచి తేనెటీగలు లేచిన ప్రతిసారి స్థానికులు, అక్కడి నుంచి వెళ్లే వారంతా హడలిపోతున్నారు.

ముఖ్యంగా ఈ తేనెతుట్ట ఓ రెస్టారెంట్లకు అతి సమీపంలో ఉండటంతో అక్కడికి వచ్చే కస్టమర్లు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ 2 రోజుల క్రితం గుర్తించింది.అనంతరం ఈ తేనెటీగలను అక్కడినుంచి తరలించాలని నడుంబిగించారు అధికారులు.ఆపై ప్రజలందరినీ టైమ్ స్క్వేర్ చుట్టుపక్కలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తేనెటీగలకు కూడా ఏ మాత్రం హాని కలగకుండా తేనెపట్టును తొలగించారు.

వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా సురక్షితమైన ప్రాంతానికి తరలించారు.తేనెటీగల బెడద వదిలిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి పోలీసులు వెల్లడించారు.

ఇది చూసిన నెటిజనులు మీరు సూపర్ సార్ అని కామెంట్స్ పెడుతున్నారు.ముఖ్యంగా స్థానికులు పోలీసులు చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

అలాగే తాము రోజూ తిరిగే ప్రాంతాన్ని సురక్షితంగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube