ఫలించని దిగ్విజయ్ పూజలు...ప్రజ్ఞా గెలుపు  

Pragya Singh Wins In Bhopal-bjp,digvijay Singh,malega,pragya Singh,బీజేపీ,భోపాల్

భోపాల్ ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసిన బీజేపీ సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ విజయం సాధించింది. భోపాల్ లో ప్రధాన ప్రతిపక్షం అయినా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో పోటీ పడిన ఆమె విజయాన్ని అందుకుంది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా నిందితురాలు అన్న సంగతి తెలిసిందే..

ఫలించని దిగ్విజయ్ పూజలు...ప్రజ్ఞా గెలుపు -Pragya Singh Wins In Bhopal

ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె భోపాల్ లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసింది. ఆమె పోటీ పై పలువురు విముఖత చూపారు. పేలుళ్ల కేసులో నిందితురాలు ఎంపీ గా గెలిచి ఏమి చేస్తుంది అంటూ ప్రశ్నించారు.

కానీ ఇప్పుడు ప్రగ్యా సింగే విజయం సాధించడం విశేషం. ఎట్టి పరిస్థితిలో విజయం సాధించి భోపాల్ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవాలనే ఉద్ధేశ్యంతో సీనియర్ నేత దిగ్విజయ్‌ని కాంగ్రెస్ బరిలోకి దింపింది. కానీ దిగ్విజయ్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.

మరోపక్క ప్రజ్ఞా సింగ్ విజయం సాదించకూడదు అని ఇటీవల దిగ్విజయ్ కంప్యూటర్ బాబా తో పూజలు కూడా చేయించిన సంగతి తెలిసిందే. అయినా డిగ్గీ రాజా పూజలు మాత్రం ఫలించలేదు. దీనితో ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కాక తప్పలేదు.