యుట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న కంచె భామ  

Pragya Jaiswal Started New youtube Channel, Tollywood, Social Media, Cooking Videos, Telugu Heroines - Telugu Cooking Videos, Pragya Jaiswal Started New Youtube Channel, Social Media, Telugu Heroines, Tollywood

కంచె సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ప్రగ్యా జైస్వాల్.మొదటి సినిమాతోనే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న ఈ అమ్మడు తరువాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

 Pragya Jaiswal Youtube Channel Kanche Krish

అడపాదడపా సినిమాలు చేసిన వాటిలో ఆమెకి ఏ ఒక్కటి కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలబడేంత స్కోప్ ఇవ్వలేదు.ఇక దర్శకులు ఆమెని కేవలం ఐటెం సాంగ్స్ లేదంటే గ్లామర్ పాత్రలకి మాత్రమే ఎంపిక చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడు అవకాశాలు పెంచుకోవడానికి రెగ్యులర్ గా తన హాట్ ఫోటో షూట్ లతో దర్శకులకి గాలం వేస్తూనే ఉంది.అయితే ఆమె ఫోటోషూట్ ల కారణంగా ఇంస్టాగ్రామ్ లోకి ఆమెకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు తప్ప సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు.

యుట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న కంచె భామ-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రగ్యాని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది.అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

ఇదిలా ఉంటే ప్రగ్యా ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ ఫాలోవర్స్ ని బాగా పెంచుకుంది.ఇప్పుడు తనలో మరో టాలెంట్ ని బయట పెట్టేందుకు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది.

ఈ యుట్యూబ్ ఛానల్ ద్వారా తనకు ఇష్టమైన, తనకు తెలిసిన కొన్ని వెరైటీ వంటాకల గురించి చెప్తుందంట.ఈ మధ్య హీరోయిన్స్ తో పాటు సేడ్ యాక్టర్స్, యాంకర్స్ కూడా యుట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్లలో క్రియేటివిటీ బయట పెట్టుకుంటున్నారు.

ఇదే దారిలో బెటర్ అనుకుందో ఏమో ప్రగ్యా జైశ్వాల్ కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది.మొదటి ఎపిసోడ్ గా ఆమె ఫేవరేట్ అయిన జపనీస్ చీస్ కేక్ తయారు చేసే విధానాన్ని పెట్టింది ప్రగ్యా.

హీరోయిన్ కాబట్టి ఇలా వీడియో పెట్టిందో లేదో అలా వ్యూస్ వస్తూనే ఉన్నాయి.మొత్తానికి ప్రేక్షకులకి దగ్గరగా ఉండటానికి ప్రగ్యా మంచి దారినే ఎంచుకుంది అని ఇప్పుడు ఆమె వంటల వీడియోలు చూస్తున్నవారు అంటున్నారు.

#Cooking Videos #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pragya Jaiswal Youtube Channel Kanche Krish Related Telugu News,Photos/Pics,Images..