సన్నాఫ్ ఇండియాలో ప్రగ్యా అలాంటి పాత్ర చేస్తోందా?  

Pragya Jaiswal To Do Police In Son Of India, Pragya Jaiswal, Son Of India, Mohan Babu, Tollywood News - Telugu Mohan Babu, Pragya Jaiswal, Son Of India, Tollywood News

టాలీవుడ్‌లో సక్సెస్ ఉన్నప్పుడే హీరోయిన్లు తమకు అందివచ్చిన పాత్రలన్నీ చేస్తూ దూసుకుపోతారు.అయితే కొంతమంది మాత్రమే ఫెయిల్యూర్‌లో కూడా కొన్ని గుర్తుండిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.

TeluguStop.com - Pragya Jaiswal To Do Police In Son Of India

తాజాగా తెలుగు సినిమాల్లో ఫేడవుట్ అవుతున్న ఓ బ్యూటీ, ఇప్పుడు అలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్, ప్రస్తుతం ఫేడవుట్ అయ్యే స్టేజీలో ఉంది.

కానీ ఆమెకు తాజాగా రెండు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించే అవకాశాలు రావడంతో, ఆమె తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ, తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న సన్నాఫ్ ఇండియా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం కొట్టేసింది.

TeluguStop.com - సన్నాఫ్ ఇండియాలో ప్రగ్యా అలాంటి పాత్ర చేస్తోందా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో, ఇందులో ఓ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పోలీస్ అవతారంలో కనిపించింది.

కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఆమె పాత్రను ప్రేక్షకులు ఏమాత్రం గుర్తించలేకపోయారు.ఇక మోహన్ బాబు నటిస్తున్న సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాను మంచు విష్ణు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మరి ఈ సినిమాలో ప్రగ్యా పాత్ర ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

ఏదేమైనా ప్రగ్యాకు రెండు సినిమాల అవకాశాలు రావడంతో ఆమె ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

#Mohan Babu #Pragya Jaiswal #Son Of India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు