అప్పుడైతే లిప్ కిస్ కు ఓకే చెబుతా.. ప్రగ్యా కామెంట్స్ వైరల్..?

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్ సీనియర్ స్టార్ హీరోగా బాలకృష్ణకు జోడీగా అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Pragya Jaiswal Shocking  Comments About Kiss And First Day On Dating, First Day-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ సాధారణమే అయినప్పటికీ డేటింగ్ విషయంలో ఒక హీరోయిన్ కు మరో హీరోయిన్ కు భిన్నాభిప్రాయాలు ఉంటాయి.

తాజాగా ఈ బ్యూటీకి డేటింగ్ చేస్తే తొలిరోజే లిప్ కిస్ పెడతారా అనే ప్రశ్న ఎదురు కాగా అందుకు తాను అంగీకరించనని ప్రగ్యా అన్నారు.

అలా అని తాను లిప్ కిస్ పెట్టడానికి కూడా నో చెబుతానని భావించవద్దని ఆమె చెప్పుకొచ్చారు.డేటింగ్ చేసిన వ్యక్తితో తన మనస్సు కలిస్తే అప్పుడు తనకు లిప్ కిస్ పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని ప్రగ్యా చెప్పుకొచ్చారు.

కొన్ని రోజులు డేటింగ్ చేసే వ్యక్తితో జీవించి లిప్ కిస్ విషయంలో నిర్ణయం తీసుకుంటానని ఆమె అన్నారు.

Telugu Akanda, Balakrishna, Boyapati Srinu, Day, Lip, Pragya Jaiswal-Movie

అయితే ప్రస్తుతం మాత్రం తాను ఎవరితో డేటింగ్ లో లేనని ప్రగ్యా పేర్కొన్నారు.లిప్ కిస్ గురించి ప్రగ్య జైస్వాల్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ అఖండతో భారీ సక్సెస్ ను సాధించి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరతారేమో చూడాల్సి ఉంది.

కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించడం వల్ల ప్రగ్యా కెరీర్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు.

Telugu Akanda, Balakrishna, Boyapati Srinu, Day, Lip, Pragya Jaiswal-Movie

మరోవైపు ప్రగ్యా జైస్వాల్ నటించిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.బాలయ్య సినిమాలో అవకాశంతో ప్రగ్యా జాతకం మారుతుందేమో చూడాలి బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో వచ్చిన రెండు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube