బాలయ్యతో రొమాన్స్ కి రెడీ అయిన వరుణ్ తేజ్ హీరోయిన్  

Pragya Jaiswal Romance With Balayya In Boyapati Movie-pragya Jaiswal Romance With Balayya,south Cinema,tollywood

కంచె సినిమాతో వరుణ్ తేజ్ కి జోడీగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈ భామ త స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు.

Pragya Jaiswal Romance With Balayya In Boyapati Movie-Pragya South Cinema Tollywood

అయితే ఊహించని విధంగా ఈ భామకి పెద్దగా అవకాశాలు రాలేదు.అవకాశాలు వచ్చిన కూడా గ్లామర్ పాత్రలే కావడం విశేషం.

కంచె తర్వాత ఏ సినిమాలో కూడా ఆమె తన పెర్ఫార్మెన్స్ చూపించుకునే అవకాశం రాలేదు.కేవలం సినిమాలలో అందాల ప్రదర్శనకి, సెకండ్ హీరోయిన్ పాత్రలకే ప్రగ్యాని దర్శకులు పరిమితం చేశారు.

ఈ మాత్రం దానికి సినిమాలు చేయాలా అని భావించిన అమ్మడు అందాల ప్రదర్శనకి సోషల్ మీడియాని వేదికగా మార్చుకుంది.తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ తన ఫలోవర్స్ కి అందుబాటులో ఉంటుంది.

తన గ్లామర్ అందాలతో ఎప్పటికప్పుడు ఈ భామ సందడి చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ భామకి ఇప్పుడు ఊహించని విధంగా అద్బుతమైన ఆఫర్ ని వచ్చిపడింది.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కబోతుంది.ఈ సినిమా కాస్టింగ్ సెలక్షన్ ప్రస్తుతం జరుగుతుంది.మరో వైపు ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్ లో చాలా నేచురల్ గా కనిపించడానికి బాలయ్య సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్స్ గా నయనతార, శ్రియ లాంటి వారి పేర్లు వినిపించాయి.

అయితే ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ని బోయపాటి ఫైనల్ చేశాడని సమాచారం.త్వరలో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే అవకాశాలు లేక సోషల్ మీడియాకి పరిమితం అయిపోయిన ప్రగ్యాకి ఇది నిజంగా మంచి అవకాశం అని టాలీవుడ్ లో అందరూ చెప్పుకుంటున్నారు.

తాజా వార్తలు