అహం బ్రహ్మాస్మి లో ప్రగ్యా జైస్వాల్

కంచె సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పంజాబీ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.మొదటి సినిమాలో చీరకట్టులో చాలా సంప్రదాయగా కనిపించిన ఈ అమ్మడు తరువాత తనలోని అసలు గ్లామర్ ని బయటకి తీసుకొచ్చింది.

 Pragya Jaiswal Plays Important Role In Aham Brahmasmi-TeluguStop.com

హాట్ ఫోటో షూట్ లతో తను ఎంత గ్లామర్ క్వీన్ అనేది షో అప్ చేసింది.దీంతో నెక్స్ట్ మూవీ నుంచి ప్రగ్యాకి అన్ని కూడా గ్లామర్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి.

అయితే కంచె సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ప్రగ్యా నెక్స్ట్ సినిమా నుంచి అసలు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేని పాత్రలు చేస్తూ వస్తూ ఉండటంతో కేవలం టాలీవుడ్ లో ఆమె గ్లామర్ బ్యూటీగానే మిగిలిపోయింది.అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

 Pragya Jaiswal Plays Important Role In Aham Brahmasmi-అహం బ్రహ్మాస్మి లో ప్రగ్యా జైస్వాల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తన హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ భాగానే పెంచుకుంది.ఇక తెలుగులో లాభం లేదనుకొని హిందీలో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అక్కడ అదృష్టం కొద్ది ఏకంగా సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించే అవకాశం ఈ బ్యూటీ సొంతం చేసుకుంది.త్వరలో ఆ మూవీ పట్టాలు ఎక్కనుంది.మరో వైపు బాలయ్యకి జోడీగా అఖండ మూవీలో మెయిన్ హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది.ఇదిలా ఉంటే తెలుగులో ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది.

మంచు మనోజ్ ఏకంగా మూడేళ్ళు గ్యాప్ తీసుకొని ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ తో అహంబ్రహ్మస్మి అనే మూవీ చేస్తున్నాడు.శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.

మంచు మనోజ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా ఓ కీలక పాత్రలో ప్రగ్యా జైశ్వాల్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుంది.

#Aham Brahmasmi #Manchu Manoj #Pragya Jaiswal #Srikanth Reddy #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు