హీరోయిన్ అనుకుంటే ఐటెం పాపగా మారింది!  

Pragya Jaiswal Item In Pawan Kalyan Movie-pawan Kalyan,pragya Jaiswal,pspk28,telugu Movie News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తరువాత తమిళ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా సక్సెస్ చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Pragya Jaiswal Item Song In Pawan Kalyan Movie-Pawan Pragya Pspk28 Telugu Movie News

ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్, షూటింగ్‌ను అతి త్వరలో మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కంచె ఫేం బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం లేదని, ఆమె చేయబోయే పాత్ర ఇదంటూ మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.ఫేడవుట్ హీరోయిన్‌గా మారిన ప్రగ్యా జైస్వాల్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకుంటే సినిమాకు నష్టం జరగవచ్చని భావించిన చిత్ర యూనిట్, ఆమెతో ఓ ఐటెం సాంగ్ చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారట.

కంచె సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రగ్యా, నటనతో ఆకట్టుకున్నా తన కెరీర్‌ను మాత్రం బిల్డ్ చేసుకోలేకపోయింది.దీంతో ప్రస్తుతం ఆమె కనుమరుగవుతున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ను ఈ సినిమాలో అవకాశం ఇవ్వాల్సిందిగా కోరిందట.

తొలుత ఆమెను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆమెకు ఐటెం సాంగ్‌ లేదా సినిమాలో ఓ పాత్ర ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.ఏదేమైనా తనకు ఈ సినిమాలో ఛాన్స్ దొరికి, మళ్లీ అవకాశాలు వస్తే చాలనుకుంటోంది ఈ బ్యూటీ.

మరి ప్రగ్యాకు ఈ సినిమాలో ఎలాంటి అవకాశం లభిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.

తాజా వార్తలు