విడ్డూరం : ముగ్గురు అక్క చెల్లెల్ల ముద్దుల మొగుడు  

Pradesh Karva Chauth Three Sisters Wants To Share One Husband - Telugu Karva Chauth Three Sisters, Pinky, Reena, Shoba, Telugu Viral News Updates, Viral In Social Media, పింకీ, రీనా, శోభా

ఒకప్పుడు రాజులు లెక్కకు మించిన భార్యలను కలిగి ఉండే వారు.రాజులు ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నా ఎవరు ఏమనేవారు కాదు.

Pradesh Karva Chauth Three Sisters Wants To Share One Husband

ఇక ముస్లీం సాంప్రదాయం ప్రకారం కూడా ఎంతమంది భార్యలను అయినా కలిగి ఉండవచ్చు.దాంతో అప్పట్లో ముస్లీం పురుషులు లెక్కకు మించి భార్యలను కలిగి ఉండేవారు.

ఇప్పుడు కూడా ముస్లీంలు కొందరు బహు భార్యత్వంను పాటిస్తున్నారు.కాని హిందువుల్లో మాత్రం ఒక్కరే భార్య సాంప్రదాయం ప్రస్తుతం కొనసాగుతుంది.

విడ్డూరం : ముగ్గురు అక్క చెల్లెల్ల ముద్దుల మొగుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

అత్యంత అరుదుగా మాత్రమే ఇద్దరు భార్యలను హిందువులు కలిగి ఉండటం మనం చూస్తాం.

పెరిగిన టెక్నాలజీ ఇతరత్ర కారణాల వల్ల ఒక వ్యక్తి ఒక్క అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు.

అయినా ఒక్క అమ్మాయిని భరించడమే చాలా కష్టం అవుతున్న ఈ రోజుల్లో ఇద్దరు భార్యలు ఉంటే వాడికి బోడగుండు గీకడం ఖాయం.ఒక్కరితో తట్టుకోలేక పోతున్నాం.నువ్వు ఇద్దరిని ఎలా గురూ అంటూ ఇద్దరు భార్యలను ఉన్న వారిని చూసి సరదా వ్యాఖ్యలు చేస్తారు.కాని మహారాష్ట్రకు చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు.

 ఆ ముగ్గురు కూడా సొంత అక్క చెల్లెల్లు అవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.ఇటీవల ఉత్తర భారతదేశంలో హిందువులు కార్వా చౌత్‌ వేడుక జరుపుకున్నారు.ఈ పండుగ ప్రకారం జల్లెడలో భర్తను చూసి ఆ తర్వాత చందమామను చూస్తారు.ఆ తర్వాత భర్త చేతితో ఇచ్చే తీర్ధం మరియు ప్రసాదం తీసుకుని ఉపవాసం వదులుతారు.

కృష్ణ భార్యలు ముగ్గురు కార్వా చౌత్‌ పండుగ జరుపుకున్నారు.ముగ్గురు కూడా జల్లెడ నుండి కృష్ణను చూస్తున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 అతడు చూడ్డానికి చాలా నార్మల్‌గా ఉన్నాడు.అతడు పెద్దగా చదువుకున్నట్లుగా కూడా అనిపించడం లేదు.అయినా కూడా అతడిని ఈ ముగ్గురు అక్కచెల్లెలు అయిన శోభా, రీనా, పింకీలు పెళ్లి ఎలా చేసుకున్నారంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.ప్రేమ గుడ్డిది అంటూ ఇందుకే అంటారేమో.

ముగ్గురు కూడా కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ముగ్గురి కూడా ఏరి కోరి అతడిని వివాహం చేసుకున్నారు.

ఈ ముగురిని కృష్ణ ఎలా భరిస్తున్నాడో అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు