Pradeep Ranganatham : కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇస్తే వద్దని డబ్బులు తీసుకున్నా.. ఆ డబ్బుతో మూడేళ్లు బ్రతికా!

ప్రదీప్ రంగనాథన్ గత నాలుగైదు రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు.లవ్ టుడే సినిమాతో టాలీవుడ్ ను షేర్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో డైరెక్టర్ ప్రదీప్.

 Pradeep Ranganathan About Career Starting, Pradeep Ranganathan, Costly Car, Love-TeluguStop.com

లవ్ టుడే సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించాడు.ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.

కోలీవుడ్ లో ప్రదీప్ జయం రవితో కలిసి కోమాలి అనే సినిమాను తెరకెక్కించాడు.ఇందులో జయం రవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.

అయితే మొదటి సినిమా మంచి హిట్ సాధించడంతో ఆ సినిమా నిర్మాతలు ప్రదీప్ రంగనాథరంకు కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారట.

కానీ ప్రదీప్ మాత్రం ఆ కారును వెనక్కి తిరిగి ఇచ్చేసి తనకు కారు వద్దని ఆ కారు ఎంత రేటు ఉంటుందో అంత డబ్బు ఇవ్వండి అని కోరాడట.అలా ఎందుకు అడిగాడు అంటే ఆ సమయంలో తనకు కారు మెయింటైన్ చేసే స్థోమత లేదని కారు ఉన్నా కూడా పెట్రోల్ కి డబ్బులు లేవు అని చెప్పాడట.

దాంతో కోమాలి సినిమా నిర్మాత ప్రదీప్ కు డబ్బులు ఇవ్వడంతో ఆ డబ్బులతోనే లవ్ టు డే సినిమాను తీసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Career, Car, Love-Movie

ఇండస్ట్రీలో కలను నెరవేర్చుకోవడానికి కాస్ట్లీ కార్లు ఆడంబరాలు చూపించుకోవడానికి కాదు అని ఈ కుర్ర డైరెక్టర్ ప్రదీప్ చెప్పకనే చెప్పాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇకపోతే ఇటీవలే విడుదల అయిన లవ్ టు డే సినిమాకు ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి బాగానే స్పందన లభిస్తోంది.ఈ సినిమాను చూడటానికి థియేటర్లకు బార్లు కడుతున్నారు ప్రేక్షకులు.

కాగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను సేమ్ టైటిల్ తో తెలుగులోకి అనువదించి విడుదల చేసిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube