ప్రదీప్ 'పెళ్లిచూపులు' షో గురించి సంచలన రహస్యాలు బయటపెట్టిన కంటెస్టెంట్..! ఆమె సెలెక్ట్ అయ్యింది కానీ.?  

బిగ్ బాస్ ముగియగానే మరో కొత్త షో కు తెరతీసింది మా టీవీ. ప్రదీప్, సుమ కీ రోల్ లో “పెళ్లి చూపులు” స్టార్ట్ అయ్యింది. కానీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ షో. యాంక‌ర్ ప్రదీప్ తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఈ షో ద్వారా ఎంపిక చేసుకుంటున్నట్లు ప్ర‌చారం చేస్తొంది. ఆదివారం నుండి ప్రారంభం అయిన ఈ షో కోసం కొన్ని వందల మంది అమ్మాయిలు అప్పై చేసుకోగా చివరకు 14 మంది సెలక్ట్ అయ్యారని టాక్.

అయితే ఈ షోకు సెలెక్ట్ అయ్యి…కొన్ని కారణాల వల్ల కంటెస్ట్ చేయ‌లేక‌పోయిన‌ లుబ్నా వాలియా అనే అమ్మాయి ఈ షో గురించి కొన్ని రహస్యాలు బయటపెట్టింది. టీవీ షోలో చేయాలని నాకు ఎప్పటి నుండో కోరిక ఉండేది. చాలా షోలకు అప్లై చేశాను. ఎప్పుడూ సెలక్ట్ అవ్వలేదు. ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షో గురించి యాడ్ చూసి ఇది ఒక మంచి అవకాశంగా భావించి అప్లై చేశాను. సెలక్ట్ కూడా అయ్యాను. అయితే నాకు ఎగ్జామ్స్, వారు అడిగిన డేట్స్ ఒకేసారి రావడంతో వెళ్లలేక పోయాను అని లుబ్నా వాలియా తెలిపారు.

Pradeep Pelli Choopulu Contestant Lubna Valiya Reveals Facts-

Pradeep Pelli Choopulu Contestant Lubna Valiya Reveals Facts

ఇందులో కంటెస్టెంట్లను నాలుగు దశల్లో ఫిల్టర్ చేసి ఎంపిక చేసారు. మొదట ‘మా టీవీ’ తరుపున ఒక అప్లికేషన్ ఫాం ఇచ్చారు. అందులో మన పర్సనల్ డీటేల్స్ ఫిల్ చేయమని చెప్పారు. ప్రదీప్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి అంటే మీ దృష్టిలో ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు అడిగారు. దాంట్లో సెలక్ట్ అయ్యావని రెండు మూడు రోజుల్లో కాల్ వచ్చిందని లుబ్నా వాలియా తెలిపారు.

అయితే అక్కడితో ఆగకుండా ఆ తర్వాత మీకు మెయిల్ ద్వారా కొన్ని ప్రశ్నలు పంపిస్తాము, వాటిని ఫిల్ చేయండి, సెలక్ట్ అయితే మీతో మాట్లాడతామని చెప్పారు. అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. దాదాపు 30 నుండి 40 ప్రశ్నలు ఉన్నాయి. ఫ్యామిలీ, పర్సనల్ డీటేల్స్ దగ్గర నుండి నాన్న ఏం చేస్తారు? మదర్ వర్కింగా? లేక హోం మేకరా? మీ మతం ఏమిటి? మీ కులం ఏమిటి? ఇలా చాలా అడిగారు. మీ ఎథిక్స్ ఏమిటి? ఒక వేళ మీరు పెళ్లి చేసుకుంటే ప్రదీప్ ను యాంకరింగ్ చేయడానికి అనుమతిస్తారా? అతడు ఇండస్ట్రీలో ఉండటం మీకు ఓకేనా? అలా చాలా ప్రశ్నలు అడిగారు. అవి ఫిల్ చేసిన 15 నుండి 20 రోజుల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. మీకు సెలక్ట్ అయ్యారు, మీరు షోకు రావాలి అన్నారు.

20 రోజులు అగ్రిమెంట్ రాసివ్వాలన్నారు. అయితే నాకు అప్పుడే ఎగ్జామ్స్ ఉండటం వల్ల నేను డేట్స్ ఇవ్వలేక పోయాను. వారు నన్ను మళ్లీ అప్రోచ్ అయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉన్నాయని చెప్పారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నేను చేయలేను అన్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ మీకు రాదు అని వారు చెప్పారు. అయినా నేను నో చెప్పాను… అని లుబ్నా వాలియా తెలిపారు. ఇది గేమ్ షో మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఈ షో ద్వారా తనకు తెలియని ఒక అమ్మాయి ప్రదీప్ తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. టీఆర్పీల కోసమే ఈ షో మొదలు పెట్టినట్లు నేను భావిస్తున్నాను అని లుబ్నా వాలియా అన్నారు. అంటే ఇది అంతా ఉత్తుత్తి పెళ్లి చూపులే.!