హీరో గా యాంకర్ ప్రదీప్ భారీ బడ్జెట్ సినిమా..ఇంతకీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా...  

Pradeep Machiraju Movie Heavy Budget-

యాంకర్ ప్రదీప్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో , బుల్లి తెర పైన తన యాంకరింగ్ తో ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు ప్రదీప్.ఇతను చేసిన దాదాపు ప్రతి టీవీ షో కి మంచి స్పందన వచ్చింది.

Pradeep Machiraju Movie Heavy Budget--Pradeep Machiraju Movie Heavy Budget-

అయితే ఇతను గతం లో కూడా చెప్పాడు తనకు సినిమాల్లో నటించడం ఇష్టమని , ఇప్పటికే జులాయి , అత్తారింటికి దారేది ఇంకా మరి కొన్ని సినిమాల్లో సైడ్ యాక్టర్ గా పనిచేయగా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు .కానీ ప్రదీప్ ఇప్పటి వరకు ప్రేక్షకులకు గుర్తుండి పోయే పాత్రలో నటించలేదు.యాంకర్ గా ప్రస్తుతం టాప్ స్థాయి లో ఉన్న ప్రదీప్ ఇప్పుడు హీరోగా మరొక సినిమా తో వస్తున్నాడు.

Pradeep Machiraju Movie Heavy Budget--Pradeep Machiraju Movie Heavy Budget-

అసలు విషయానికొస్తే యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నారంట , ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందంట.ఈ సినిమాకి దర్శకుడిగా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన మున్నా పరిచయం అవుతున్నాడు.

గతేడాది ఈ సినిమా స్టోరీ ప్రదీప్ కి వినిపించగా తనకి తెగ నచ్చేయడం తో సినిమా సెట్ పైకి వెళ్ళింది.అయితే ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామా కథ తో తెరకెక్కిస్తున్నారు.ఈ కథ 1947 సమయం లో జరిగే ప్రేమ కథ.

ఈ సినిమాని ముందుగా కోటి రూపాయలలో పూర్తి చేయలనుకున్నారట , అయితే కథ డిమాండ్ చేయడం తో ఈ సినిమా బడ్జెట్ 4 కోట్ల వరకు అయింది.యాంకర్ ప్రదీప్ తో 4 కోట్ల బడ్జెట్ సినిమా అంటే అతని రేంజ్ కి అది భారీ బడ్జెట్ గానే పరిగణలోకి వస్తుంది.ఇక ఈ సినిమాలో ప్రదీప్ సరసన ఓ తమిళ బ్యూటీ న‌టించ‌బోతుంది.త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయి.ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైపోయింది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల‌తో బిజీగా ఉంది ఈ చిత్రం.