పెళ్లి కొడుకు కాబోతున్న యాంకర్ ప్రదీప్  

Pradeep Machiraju marriage fixed news viral, Tollywood, Telugu Television, Anchor Pradeep, Dhee Show, - Telugu Anchor Pradeep, Dhee Show, Pradeep Machiraju Marriage Fixed News Viral, Telugu Television, Tollywood

టెలివిజన్ రంగంలో మహిళల్లో సుమ నెంబర్ వన్ యాంకర్ కాగా ఆమె స్థాయిలోనే మేల్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి యాంకర్ ప్రదీప్.తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్స్ కి మొదట్లో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా తరువాత ఆర్జే నుంచి టెలివిజన్ యాంకర్ గా తన ప్రస్తానం మొదలు పెట్టి చాలా వేగంగా అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్ స్థాయికి వచ్చేశాడు.

TeluguStop.com - Pradeep Machiraju Marriage Fixed News

ప్రస్తుతం ఇతను రోజుకి కనీసం రెండు, మూడు షోలు చేస్తూ ఉంటారు.మొత్తం మూడు ఛానల్స్ లో ప్రదీప్ చేస్తున్న షోలు వస్తూ ఉంటాయి.

ఇదిలా ఉంటే యాంకర్ గా అతను స్టేజ్ మీద ఉంటే వినోదానికి కొదవ ఉండదు.సహ నటులు తన మీద జోకులు పేలుస్తూ ఉంటారు.

TeluguStop.com - పెళ్లి కొడుకు కాబోతున్న యాంకర్ ప్రదీప్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా ప్రదీప్ పెళ్లి అనేది ప్రతి షోలో కూడా ఒక టాపిక్ గా మారిపోతుంది.అయితే ఈ పెళ్లి టాపిక్ ఎత్తిన ప్రతీసారి అతను తప్పించుకుంటూ వస్తున్నాడు.

ఈ నేపధ్యంలో మీడియా చాలా సార్లు అతనికి పెళ్లి కూతురుని  చూసి పెళ్లి కూడా చేసేసింది.మరోసారి అతని పెళ్లి గురించి హాట్ టాపిక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.

అయితే ఈ సారి వినిపిస్తున్న వార్త మాత్రం నిజమే అని చెప్పుకుంటున్నారు.ఇప్పటికే అతని పెళ్లిచూపులు కార్యక్రమం అయిపోయిందట.

పెళ్లి బాజాలు మోగడమే లేటు అని తెలుస్తోంది.అధికారికంగా ప్రదీప్ వెల్లడించకపోయినా బుల్లితెర వర్గాల్లో ప్రదీప్ పెళ్లి వార్త  చక్కర్లు కొడుతోంది.

తెలిసిన సమాచారం ప్రకారం ప్రదీప్  చేసుకోబోయే అమ్మాయి సినిమా, టీవీ రంగాలకు సంబంధం లేని కుటుంబం నుంచి వస్తోందని తెలుస్తోంది.రాజకీయాలలో టీడీపీ తరఫున యాక్టివ్ గా ఉన్న ఒక యువ మహిళానేత అని తెలుస్తోంది.

రాయలసీమకు చెందిన యువ రాజకీయవేత్తతో ప్రదీప్ మూడుముళ్ల బంధం పడబోతోంది అనేది చెప్పుకుంటున్నారు.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే ప్రదీప్ క్లారిటీ ఇచ్చేంత వరకు వేచి చూడాలి.

#Dhee Show #Anchor Pradeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pradeep Machiraju Marriage Fixed News Related Telugu News,Photos/Pics,Images..