పెళ్లి చూపులు’ పూర్తి.. పెళ్లి జరిగేనా?   Pradeep Machiraju Chooses Gnaneswari Kandregula     2018-11-11   10:54:20  IST  Sainath G

స్టార్‌ మాలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగిసిన తర్వాత ప్రదీప్‌ పెళ్లిచూపులు ప్రారంభించిన విషయం తెల్సిందే. ప్రదీప్‌ పెళ్లి చూపులు అనగానే అందరు ఆసక్తి చూపించారు. అయితే షో ప్రారంభం అయిన మొదటి రోజే విమర్శల పాలు అయ్యింది. ఇదేం షో రా బాబు అనుకున్నారు. షో ఎప్పుడు ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ మొదలైంది. దాదాపు మూడు నెలలు ప్లాన్‌ చేసిన ఈ షోను తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్న విమర్శల కారణంగా వెంటనే ముగించేయాలని నిర్ణయించుకుని తాజాగా షోను పూర్తి చేశారు.

ప్రదీప్‌ పెళ్లి చూపులు షో లో ఒక అమ్మాయి ఫైనలిస్ట్‌గా ఎంపిక అయ్యింది. మరి ఆ అమ్మాయిని ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు బుల్లి తెర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రదీప్‌ షోలో ఎంపిక అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అంటూ ప్రచారం అయితే జరిగింది. కాని అధికారికంగా మాత్రం ఎప్పుడు, ఎవరు చెప్పలేదు. దాంతో ప్రదీప్‌ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం లేదు.

Pradeep Machiraju Chooses Gnaneswari Kandregula-

ప్రదీప్‌ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోక పోతే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రదీప్‌ ఎంతో మంది అమ్మాయిలు వస్తే వారికి అనేక పరీక్షలు పెట్టి ఇప్పుడు ఇది గేమ్‌ షో జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అంటూ వదిలించుకునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా సంఘాల వారు కొందరు ప్రదీప్‌ పెళ్లి చూపుల ఇష్యూలో ఆగ్రహంతో ఉన్నారు. వారు ఫైనల్‌ విజేతను పెళ్లి చేసుకోవాల్సిందే అంటే మాత్రం ప్రదీప్‌కు కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.