ఊరించి ఉసూరుమనిపించిన బిగ్‌బాస్‌.. ప్రదీప్‌ ఆ విషయం బయట పెట్టాడు     2018-07-20   10:31:32  IST  Ramesh Palla

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మెల్ల మెల్లగా జోరందుకుంది. వారాలు గడుస్తున్నా కొద్ది షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ప్రతి వారం ఏదో ఒక ఆసక్తికర సంఘటన బిగ్‌బాస్‌ ఇంట్లో జరుగుతున్న కారణంగా ప్రేక్షకులు షోను ఆధరిస్తున్నారు. ఈ వారం బిగ్‌బాస్‌ ఇంటికి ప్రదీప్‌ ప్రత్యేక అతిథిగా వెళ్లారు. మొదట బిగ్‌బాస్‌లో ప్రదీప్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ అంతా భావించారు. ఇంటి సభ్యులు అంతా కూడా ప్రదీప్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చాడని భావించారు. బ్రీఫ్‌కేస్‌తో ఇంట్లో అడుగు పెట్టిన ప్రదీప్‌కు గ్రాండ్‌ వెల్‌కం దక్కింది.

ప్రదీప్‌ తాను ఒక కంటెస్టెంట్‌గా వచ్చాను అంటూ చెబుతున్నప్పటికి కొందరు ఇంటి సభ్యులు నమ్మలేదు. అమిత్‌ అనుమానంతో ప్రదీప్‌ బ్యాగ్‌ను చూడగా, అందులో ప్రదీప్‌ వాడే బ్రాండెడ్‌ డ్రస్‌లు కాకుండా, మామూలు డ్రస్‌లు ఉన్నాయి. దాంతో ప్రదీప్‌ బిగ్‌బాస్‌ ఇంట్లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వలేదని, గెస్ట్‌గా వచ్చాడు అని తేలిపోయింది. బిగ్‌బాస్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ ప్రదీప్‌ గురించి చర్చ జరిగిన నేపథ్యంలో అంతా కూడా షాక్‌ అయ్యారు. బిగ్‌బాస్‌లో ప్రదీప్‌ ఉంటే షోలో రచ్చ రచ్చ ఖాయం అని, డబుల్‌ టీఆర్పీ రావడం ఖాయం అని అంతా భావించారు.

Pradeep Grand Entry In Bigg Boss 2 Reveals About His Marriage-

Pradeep Grand Entry In Bigg Boss 2 Reveals About His Marriage

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా నిన్నటి ఎపిసోడ్‌ను చూశారు. అయితే బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ప్రీమియర్‌కు ప్రదీప్‌ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యాడని తేలిపోయింది. గ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు తెరకెక్కించిన చిత్రం ప్రీమియర్‌ను యాక్టివిటీ ఏరియాలో ఇంటి సభ్యులతో కలిసి ప్రదీప్‌ చూడటం జరిగింది. సినిమా మొత్తం చూసిన తర్వాత ప్రదీప్‌ ఇంటి సభ్యులతో కొద్ది సమయం మాట్లాడాడు. ఇక ఈసందర్బంగానే త్వరలో తాను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు. అందుకోసం పెళ్లి చూపులు షోను ప్రారంభించబోతున్నామని కూడా ప్రకటించాడు.

బిగ్‌బాస్‌ పూర్తి అయిన తర్వాత తన ‘పెళ్లి చూపులు’ షో ప్రారంభం అవుతుందని ప్రదీప్‌ చెప్పుకొచ్చాడు. పెళ్లి చూపుల్లో వేలాది మంది అమ్మాయిలను కలిసి, వారిలోంచి ఒక్కరిని ఎంపిక చేసుకుని, వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రదీప్‌ ప్రకటించాడు. రియాల్టీ షోతో తన వివాహం జరుగబోతుందని ప్రదీప్‌ ప్రకటించాడు. తన రియాల్టీ షో పెళ్లి చూపులుకు ప్రమోషన్‌ కోసం ప్రదీప్‌ బిగ్‌బాస్‌ ఇంటికి వస్తే ప్రేక్షకులు చాలా సంతోషపడ్డారు. ప్రదీప్‌ ఇంట్లో ఉంటాడని అంతా భావించినప్పటికి బిగ్‌బాస్‌ ప్రేక్షకుల సంతోషంపై నీళ్లు జల్లాడు.