బర్త్ డే రోజు సంచలన నిర్ణయం తీసుకున్న 'యాంకర్ ప్రదీప్'.! ఎవ్వరు ఊహించి ఉండరు.?   Pradeep Decision On His Birthday At Pellichupulu Show     2018-10-25   10:45:36  IST  Sainath G

స్మాల్ స్క్రీన్ యాంకర్ గా ప్రదీప్ ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో అందరికి తెలిసిందే…ఎక్కడా శృతిమించకుండా షో ని చక్కగా ముందుకి నడిపిస్తాడు ప్రదీప్. అయితే సిల్వర్ స్క్రీన్ అభిమానులు అందరు ప్రభాస్ పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటె…స్మాల్ స్క్రీన్ అభిమానులు మాత్రం యాంకర్ ప్రదీప్ పెళ్లి ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇక 32ఏళ్ళ వయస్సు మీద పడడంతో అక్టోబర్ 23పుట్టిన రోజునాడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడంట. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2ముగిశాక ఆస్థానంలో నడుస్తున్న పెళ్లిచూపులు రియాల్టీ షోలో తనకు అన్నివిధాలా నచ్చిన అమ్మాయికి మూడు ముళ్ళు వేసెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఈ షో లో యాంకర్ సుమ కూడా కీ రోల్ పోషిస్తున్నారు. అయితే ఈ షో మొదలైనప్పుడు ఇది టీ.ఆర్.పి కోసం చేసే షో…ఇందులోనుండి ప్రదీప్ వధువును సెలెక్ట్ చేసుకోడు అని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.

కానీ ఇప్పుడు ప్రదీప్ నిర్ణయం చూస్తుంటే…మనం పప్పులో కాలేసం ఏమో అనిపిస్తుంది. ఇప్పటికే అతని పేరెంట్స్ కి ఈ షోలో అమ్మాయిలను పరిచయం కూడా చేసి, తల్లి దండ్రులకు కూడా నచ్చిన అమ్మాయినే వరించాలని భావిస్తున్నాడట.ఈ దశలో షో మీద నమ్మకం కలిగించడంతో పాటు తన జెన్యూనిటీ కూడా నిరూపించుకోవాలని ప్రదీప్ నిజంగానే ఈ షోలో ఓ అమ్మాయిని పెళ్లాడాలని డిసైడ్ అయ్యాడట. నిజానికి గతంలోనే వైజాగ్ కి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కుటుంబం నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చిందట.

Pradeep Decision On His Birthday At Pellichupulu Show-

సదరు పారిశ్రామిక వేత్త కూతురికి ప్రదీప్ బాగా నచ్చేయడంతో అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. దీంతో ఆమె పేరెంట్స్ ఓ దశలో ప్రదీప్ పేరెంట్స్ ని కల్సి సంబంధం కలుపుకోవాలని అడిగారట. కోట్లలో ఆస్తి,ఒక్కర్తే అమ్మాయి,పైగా ఫారిన్ లో చదువుకుంది. మరి ఎందుకో ఈ సంబంధాన్ని ఎటూ తేల్చలేదు. అయితే లేటెస్ట్ గా మళ్ళీ ఆ సంబంధమే వచ్చిందట. దీంతో ఆ అమ్మాయిని చేసుకుని సెటిల్ అవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చాడట. ఇంతలోనే పెళ్లిచూపులు షో,అది కాస్తా ఆడియన్స్ లో అనుమానాలు రేకెత్తించడం వంటి పరిణామాల నేపథ్యంలో షో లోనే మనసుకి నచ్చిన ఓ అమ్మాయిని పెళ్లాడాలన్న నిర్ణయం పుట్టినరోజు నాడు తీసుకున్నాడట. మరి ప్రదీప్ ఏం చేస్తాడో చూడాలి,!