ఇన్నాళ్లు ఆగిన ప్రదీప్‌ ఇప్పుడు వదిలేశాడు

నటుడిగా ప్రదీప్‌ చాలా సినిమాల్లో కనిపించాడు.అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా బుల్లి తెరపై ప్రదీప్‌ స్టార్‌ అయ్యాడు.

 Pradeep 30 Rojullo Preminchadam Ela Movie Ready To Release In Ott , Pradeep Mach-TeluguStop.com

ఆయన ఏ షోలో కనిపించినా కూడా ఆ షో మంచి విజయాన్నిసొంతం చేసుకుంటుంది.హీరోల స్థాయి గుర్తింపును దక్కించుకున్న ప్రదీప్‌ ప్రస్తుతం బుల్లి తెర సూపర్‌ స్టార్‌ అంటూ అభిమానులతో పిలిపించుకుంటున్నాడు.

ఇలాంటి సమయంలో ప్రదీప్‌ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా సమ్మర్‌ ఆరంభంలోనే విడుదల అవ్వాల్సి ఉంది.

ఈ సినిమా నుండి విడుదల అయిన నీలి నీలి ఆకాశం పాట సెన్షేషన్‌ సృష్టించింది.

ఖచ్చితంగా సినిమా కూడా ప్రత్యేకంగా ఉంటుందంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.ప్రదీప్‌ కు హీరోగా మంచి ఇమేజ్‌ను తెచ్చి పెడుతుందంటూ నమ్మకం పెట్టుకుని ఉన్నారు.అయితే సినిమా విడుదల విషయంలో యూనిట్‌ సభ్యులు ఎటు తేల్చుకోలేక పోతున్నారు.ప్రదీప్‌ ఇన్ని రోజులు తన మొదటి సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుబడుతూ వచ్చాడు.

కాని పది నెలలు అయినా ఇంకా థియేటర్ల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు.దాంతో ఇక చేసేది లేక కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు సిద్దం అవుతున్నాయి.

Telugu Aha Ott, Anchor Pradeep, Pradeep, Telugu-Latest News - Telugu

సంక్రాంతికి థియేటర్లు పూర్తి స్థాయిలో రన్‌ అయినా కూడా ఉన్న పోటీ నేపథ్యంలో మరో ఆరు నెలలు అయినా వెయిట్‌ చేయాల్సి రావచ్చు.లేదు పోటీకి విడుదల చేద్దాం అనుకుంటే మళ్లీ నిరాశ పడాల్సి వస్తుందేమో అంటూ నిర్మాతలు భయపడుతున్నారు.ఆ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రదీప్‌ ఎట్టకేలకు డిజిటల్‌ రిలీజ్‌కు ఓకే చెప్పాడు అంటూ సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నారట.నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి 25 శాతం అధనంగా ఇచ్చేందుకు ప్రముఖ ఓటీటీ ముందుకు వచ్చింది.ఆహా కూడా ఈ సినిమాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube