ప్రదీప్‌ మొదటి రోజు ఎంత రాబట్టాడో తెలుసా... టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు

యాంకర్‌ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదల అయ్యింది.దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా విడుదల కోసం ప్రదీప్‌ అభిమానులు వెయిట్‌ చేశారు.

 Pradeep 30 Rojullo Preminchadam Ela Movie Collections In First Day-TeluguStop.com

ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూడటంతో ఖచ్చితంగా ఓపెనింగ్స్ భారీగా వస్తాయని అంతా అనుకున్నారు.అనుకున్నట్లుగానే ప్రదీప్‌ క్రేజ్ తో సినిమాకు ఏకంగా రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ మొదటి రోజు నమోదు అయ్యాయి.ఈ రేంజ్‌ లో సినిమా వసూళ్లు నమోదు అవ్వడం పట్ల యూనిట్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా మొత్తం కూడా 5 కోట్ల లోపు బడ్జెట్‌ తో పూర్తి అయ్యిందని అంటున్నారు.కనుక సినిమా లాంగ్‌ రన్‌ లో 10 కోట్ల షేర్‌ దక్కించుకున్నా కూడా నిర్మాతకు భారీ లాభాలు ఖాయం అంటున్నారు.

 Pradeep 30 Rojullo Preminchadam Ela Movie Collections In First Day-ప్రదీప్‌ మొదటి రోజు ఎంత రాబట్టాడో తెలుసా… టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక డిజిటల్‌ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ అదనం.అంటే అవి ఒక పది కోట్ల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెద్ద సినిమాలు ఈ రెండు వారాల్లో లేవు.కనుక సినిమా మరో రెండు వారాల పాటు భారీగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు వసూళ్ల పరంగా పర్వాలేదు అన్నట్లుగా వస్తున్నాయి.ఈ వీకెండ్‌ తో పాటు వచ్చే వారం కలిపి మొత్తంగా రూ.10 కోట్ల వరకు వసూళ్లు రాబడితే సినిమా ఓ రేంజ్ లో సక్సెస్‌ ను దక్కించుకున్నట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమాకు మాత్రం టాక్‌ పరంగా నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

సినిమా కాపీ సినిమా అంటూ కామెంట్స్ వచ్చాయి.రివ్యూవర్స్ ఈ సినిమాకు సాదా సీదా సినిమా అన్నట్లుగా రేటింగ్ ఇచ్చారు.

అయినా కూడా ప్రదీప్ కు బుల్లి తెరపై ఉన్న క్రేజ్ నేపథ్యంలో మంచి వసూళ్లను నమోదు చేస్తుంది.ప్రదీప్‌ మరిన్ని సినిమాలు చేసే అవకాశంను ఈ సినిమా వసూళ్లు కల్పిస్తున్నాయి.

#30Rojullo #30Rojullo #30Rojullo #Pradeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు