ప్రదీప్‌ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మగధీరకు సంబంధం ఉంటుందట

బుల్లి తెరపై సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న ప్రదీప్‌ హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రాన్ని చేశాడు.ఈ చిత్రం ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడినది.

 Pradeep 30 Rojullo Preminchadam Ela Magadheera-TeluguStop.com

సినిమా ఎప్పుడు వచ్చేది చెప్పడం కష్టంగా ఉంది.ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.

అసలు ఈ సినిమా కథ ఏంటీ, ప్రదీప్‌ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

 Pradeep 30 Rojullo Preminchadam Ela Magadheera-ప్రదీప్‌ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మగధీరకు సంబంధం ఉంటుందట-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రంలో ప్రదీప్‌ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడని పాటలు చూస్తుంటే అర్థం అవుతోంది.

అలాగే ఈ సినిమా రెండు జనరేషన్స్‌కు చెందిన కథతో రూపొందినట్లుగా కూడా తెలుస్తోంది.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ మగధీర చిత్రంలోని కథ మాదిరిగా ఉంటుందట.

ఒక జన్మలో విడిపోయిన హీరో హీరోయిన్‌ మరు జన్మలో కలిసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మగధీర చిత్రంలో ప్లాష్‌ బ్యాక్‌ మాదిరిగా ఈ సినిమాలో కూడా ప్ల్యాష్‌ బ్యాక్‌ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.ఒక పల్లెటూరు ప్రాంతంలో జరిగే కథాంశం గత జన్మ కాగా, కాలేజీ నేపథ్యంలో జరిగే కథ ప్రస్తుత జనరేషన్‌కు తగ్గట్లుగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఈ తరహా చర్చ జరుగుతుండటంతో సినిమాపై జనాల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

#30Rojullo #Story #Corona Virus #Magadheera

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు