ప్రభు నయన్‌ కలయిక అంతా ఉత్తదేనట  

Prabhudeva Nayantara Movie Rumors - Telugu Lady Oriented Movie, Nayantara, Prabhudeva, Producer Ishari Ganesh, Vignesh Shivan

తమిళ మీడియాలో గత రెండు మూడు రోజులుగా నయనతార, ప్రభుదేవాల కాంబోలో ఒక చిత్రం రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.పెళ్లి పీఠలకు వరకు వెళ్లిన వారిద్దరు కూడా కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

 Prabhudeva Nayantara Movie Rumors

మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు ఒక సినిమా కోసం కలువబోతున్నారు.నయనతారతో ప్రభుదేవా ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీని ప్లాన్‌ చేస్తున్నాడు, అందులో కార్తీ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని, ఆ సినిమాకు ఐసరాయ్‌ గణేష్‌ అనే ప్రముఖ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత ఐసరాయ్‌ గణేష్‌ స్పందించారు.ప్రభుదేవాతో తాను సినిమా తీయాలనుకుంటున్న మాట వాస్తవమే అయినా కూడా ఆ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదు.

ప్రభు నయన్‌ కలయిక అంతా ఉత్తదేనట-Movie-Telugu Tollywood Photo Image

నయనతార మా సినిమాలో నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతంకు మా ప్రాజెక్ట్‌ కేవలం ప్రారంభ దశల్లోనే ఉంది.త్వరలోనే చర్చలు జరిపి నటీనటుల ఎంపిక చేస్తామని అన్నాడు.

విఘ్నేష్‌ శివన్‌ ప్రేమలో ఉన్న నయన్‌ త్వరలో పెళ్లికి రెడీ అవుతుందని అంటున్న సమయంలో అనూహ్యంగా ప్రభుదేవాతో మళ్లీ చేతులు కలుపబోతుంది అంటూ వార్తలు రావడంతో చాలా మంది ఆమెను విమర్శించారు.ఇప్పటికి అయినా విఘ్నేష్‌ శివన్‌తో సంతోషంగా ఉండవచ్చు కదా.మళ్లీ ఎందుకు ఈ అడ్డదారులు అంటూ ఎద్దేవ చేశారు.ప్రభుదేవాతో మళ్లీ దగ్గర అయ్యేందుకు ఇలాంటి కమిట్‌ మెంట్‌ ఇచ్చిందా అని కూడా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో వార్తలన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhudeva Nayantara Movie Rumors Related Telugu News,Photos/Pics,Images..

footer-test