మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల మీద ఫుల్ ఫోకస్ గా ఉన్నారు.గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా మరోపక్క వాల్తేర్ వీరయ్య.
భోళాశంకర్ సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.ఈ సినిమాలతో పాటుగా వెంకీ కుడుముల డైరక్షన్ లో సినిమాని లైన్ లో పెట్టారు చిరంజీవి.
ఇక ఇదిలాఉంటే మెగాస్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.చిరు హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ డైరక్షన్ లో సినిమా రాబోతుందని టాక్.
అది కూడా ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్ అని టాక్.నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన స్పానిష్ థ్రిల్లర్ మూవీ ని చిరు రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రభుదేవ చెప్పారట.
ఓ రెటైర్ డాన్ కథతో ఈ మూవీ నడుస్తుంది.సినిమా కథ చిరుకి నచ్చడంతో ప్రభుదేవ డైరక్షన్ లో అతను సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.ఇదివరకు ఆల్రెడీ ప్రభుదేవ చిరుతో శంకర్ దాదా జిందాబాద్ సినిమా చేశారు.ఆ సినిమా తర్వాత ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయనున్నారు.
మరి ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి.