ఈ నెల 29న విడుద‌లకు సిద్ధ‌మైన ప్ర‌భుదేవా మిస్ట‌ర్ ప్రేమికుడు

Prabhu Deva Mr Lover Is All Set To Release On The 29th Of This Month

ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన చార్లీ చాప్లిన్త‌మిళ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .

 Prabhu Deva Mr Lover Is All Set To Release On The 29th Of This Month-TeluguStop.com

వి.కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి తెలుగులో కి మిస్ట‌ర్ ప్రేమికుడు పేరుతో అనువ‌దించారు.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి మాట్లాడుతూ ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని న‌టించ‌గా త‌మిళంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన చార్లిచాప్లిన్ చిత్రాన్ని తెలుగులో `మిస్ట‌ర్ ప్రేమికుడు` పేరుతో అనువ‌దిస్తున్నాం.

 Prabhu Deva Mr Lover Is All Set To Release On The 29th Of This Month-ఈ నెల 29న విడుద‌లకు సిద్ధ‌మైన ప్ర‌భుదేవా మిస్ట‌ర్ ప్రేమికుడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిల‌వ‌నున్నాయి.

ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డాన్స్ ని మ‌రోసారి చేయ‌బోతుంది.

సినిమాను ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం“ అన్నారు.

#Nikkigalrani #Adha Dharma #Kollywood #Orabhdeva #Reamak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube