శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభుదేవా!

న్యాచులర్ స్టార్ నాని సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంటుంది.ఏంటంటే ఈయన సినిమాలు కొత్తగా విభిన్నంగా ఉంటాయని ప్రేక్షకుల నమ్మకం.

 Prabhu Deva Interesting Review On Shyam Singha Roy Details, Prabhu Deva, Shyam S-TeluguStop.com

నాని కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కొత్త తరహా పాత్రల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు.తాజాగా ఈయన నుండి వచ్చిన సినిమా శ్యామ్ సింగ రాయ్.

క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 24 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మేకర్స్ రిలీజ్ చేసారు.

రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మించగా.

మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటించారు.

ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడమే కాకుండా మంచి వసూళ్లు కూడా రాబట్టింది.ఇక ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ రాబట్టింది.

ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.ఈ సినిమా చూసిన ప్రముఖులు శ్యామ్ సింగరాయ్ పై ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమాలో నటించిన హీరో నాని, సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు.తాజాగా ఈ లిస్టులో డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా కూడా చేరిపోయారు.ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ, మలయాళం లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.

తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ అయినట్టు వంటి ప్రభుదేవా కూడా ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ సినిమా చూశానని.సినిమా నాకు చాలా నచ్చింది అని సినిమా యూనిట్ మొత్తం గ్రేట్ వర్క్ చేసారని పొగిడారు.

దీంతో నాని ఇప్పుడు పక్క భాషల్లో కూడా విజయ పరంపర కొనసాగిస్తున్నాడు.ప్రభుదేవా నుండి ఇలాంటి రివ్యూ రావడం టీమ్ ఖుషీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube