అక్కడే 90% షూటింగ్ పూర్తి చెయ్యనున్న ప్రభాస్!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.ఇప్పటికే పలు సినిమాలలో బిజీగా ఉండగా మరిన్ని అవకాశాలు అందుకుంటున్నాడు.

 Prabhaswill Complete 90 Of The Shooting-TeluguStop.com

అంతేకాకుండా ఈయన సినిమాలతో పలువురు బాలీవుడ్ నటులు కూడా పరిచయం అవుతున్నారు.ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

 Prabhaswill Complete 90 Of The Shooting-అక్కడే 90% షూటింగ్ పూర్తి చెయ్యనున్న ప్రభాస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్సినిమాలో కూడా బిజీగా ఉండగా ఈ సినిమా సగానికి పూర్తయింది.

ఇక ఓం రౌత్ దర్శకత్వంలోఆది పురుష్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.ఇదిలా ఉంటే మరో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా సినిమా షూటింగ్ మొదలైంది.ఇక దీనికి ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను మొదలు పెట్టారు.

ఈ సినిమా 50 సంవత్సరాల చరిత్రకలిగిన నేపథ్యంలో తెరకెక్కనుంది.వైజయంతి మూవీస్ నిర్మాణంలో మూడు వందల కోట్లతో నిర్మిస్తున్నారు.టైం మిషన్ ఆధారంగా సైంటిఫిక్ నేపథ్యంతో రానున్న ఈ సినిమాకు జోరుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో మొదలుపెట్టారు.ఇక ఈ సినిమా షూటింగ్ 90% రామోజీ ఫిలిం సిటీ లోనే పూర్తి చేస్తారట.తను రాసుకున్న కథ సెట్ కు రామోజీ ఫిలిం సిటీ మాత్రమే సెట్ అవుతుందని అందుకే అక్కడే ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

మిగతా 10 శాతం షూటింగ్ వేరే దేశాలలో చేయనున్నట్లు తెలుస్తోంది.

Telugu Amitab Abchhan, Deepika Padugona, Naga Ashwin, Prabhas, Purush, Radheshyam, Ramoji Film City, Shotting Complete-Movie

ఇక ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించనున్న సంగతి తెలిసిందే.అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రభాస్ సరసన నటిస్తుంది.మొత్తానికి ఈ సినిమాలో కూడా ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్స్ పరిచయమవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ట్రయల్ షూటింగ్ మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా పూర్తి కావడానికి రెండు సంవత్సరాల సమయం పడునున్నట్లు దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు.

#Prabhas #Amitab Abchhan #Ramoji #Radheshyam #Purush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు