రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సీరీస్ తరువాత నటిస్తున్న చిత్రం సాహో.బాహుబలి రెండు భాగాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు, క్రేజ్, మార్కేట్ సంపాదించుకున్న మన డార్లింగ్ ఇకనుంచి తన సినిమాలన్నీ ఇండస్ట్రీలకి అతీతంగా మెప్పించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
రాజమౌళి అండ లేకుండా సొంతంగా మార్కేట్ ని విస్తరించాలనుకుంటున్నాడు.అందులో భాగంగానే 150 కోట్ల బడ్జెట్ తో సాహో చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేసాడు.
ఇక సాహోకి సంబంధించన టీజర్ పోస్టర్, లోగో ఇప్పటికే విడుదల కాగా, సాహో ఫస్ట్ టీజర్ ఎల్లుండి, బాహుబలితో పాటే విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.ఇదీలా ఉంటే ఎల్లుండి నుంచి యూట్యూబ్ లో దర్శనమివ్వాల్సిన టీజర్ అప్పుడే లీక్ అయిపోయింది.
టీజర్ ఎలా ఉంది అంటే … ఇంటెన్సిటి నిండిన ప్రభాస్ కన్ను లోంచి బయటకొచ్చిన ఫ్రేమ్, ప్రభాస్ రక్తాన్ని చూపిస్తుంది.“ఆ రక్తాన్ని చూస్తేనే అర్థం అవుతోంది, వాడిని చచ్చేంతలా కొట్టారని” అంటూ ఎవరో ప్రభాస్ గురించి అంటున్నారు.ఆ వెంటనే డార్లింగ్ తన ట్రేడ్ మార్క్ బాడి లాంగ్వేజ్ తో “It’s Show Time” అంటూ ఓ సూపర్ డైలాగ్ అందుకున్నాడు.అక్కడితో టీజర్ కి ది ఎండ్.
సింపుల్ గా ఉన్నా, సీరియస్ గా ఉంది.సినిమాటోగ్రాఫి అదిరిపోయింది.
నిన్న బాహుబలి సన్నివేశాలు లీక్ అయ్యాయి, ఇప్పుడు బాహుబలి ప్రింట్స్ కి జతచేసిన సాహో టీజర్ లీక్ అయ్యింది.సో, ఎక్కడో స్టూడియోల్లో లీక్ అవలేదు ఇవి.డిస్ట్రిబ్యూటర్స్ అజాగ్రత్తగా ఉండడం వల్లే లీక్ అవుతున్నాయి.టీజర్ ఎలాగో లిక్ అయ్యింది కాబట్టి, 28వ తేది దాకా ఆగకుండా, ఇవాళో రేపో ఆఫీషియల్ గా విడుదల చేసేస్తారేమో.