బాహుబలి అనంతరం ప్రభాస్ రేంజ్ తెలుగు రాష్ట్రాల హద్దులు దాటి నేషనల్ వైడ్ గా సాగిపోయింది.ఇక ప్రభాస్ పెళ్లి గోల కూడా ఇప్పుడు అలానే పాకేసింది.
టాలీవుడ్ లొనే కాకుండా బాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్త్రీలలో ప్రభాస్ పెళ్లి పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
అనుష్కతో ఇదే ఏడాది పెళ్లి అంటూ గతంలో చాలా రూమర్స్ వచ్చాయి.
వాటిపై ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ డోస్ తగ్గడం లేదు.ఇక ఇప్పుడు మరోసారి బాహుబలికి ఓ పిల్ల దొరికిందంటూ కొన్ని మీడియాలలో డప్పులు మొగుతున్నాయి.
దగ్గరి బంధువైన ఎన్నారై సంబంధం అని తెలుస్తోంది.
అమెరికాలో ఉంటున్న తెలుగు పిల్లని ప్రభాస్ కి సెట్ చేసినట్లు టాక్ వస్తోంది.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న ప్రభాస్ కి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు.కానీ ప్రభాస్ మాత్రం ఎదో ఒక వంకతో తప్పించుకుంటున్నాడు.