'ఆదిపురుష్'కు గుమ్మడికాయ కొట్టిన టీమ్.. ఇక అనుకున్న టైంకే!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ఆదిపురుష్‘ సినిమా ఒకటి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 Prabhas Wraps Up Shooting For Adipurush Movie, Adipurush, Prabhas, Om Raut, Krit-TeluguStop.com

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ఇక ఎట్టకేలకు ప్రభాస్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ముగించేసి గుమ్మడి కాయ కొట్టినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Prabhaswraps, Saif A

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాలోని ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ లు తమ పాత్రల షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఇక ఇప్పుడు టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టినట్టు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఈ సినిమా షూటింగ్ ను 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి అదే నెలలో రెగ్యురల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి కేవలం 108 రోజుల్లోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసేసాడు ఓం రౌత్.

ఇక ఇంత పక్కా ప్లానింగ్ తో షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న సమయానికి పూర్తి చేసారు.ఒక పది నెలల పాటు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే కేటాయించడం జరిగింది.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Prabhaswraps, Saif A

ఎందుకంటే ఈ సినిమా లో భారీ విజువల్ గ్రాఫిక్స్ ఉండడంతో షూటింగ్ పార్ట్ ను తొందరగా పూర్తి చేసి ఇక దీని మీద ఫోకస్ చేయబోతున్నారు.ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని గ్రాండ్ విజువల్ వండర్ ను ఆదిపురుష్ సినిమా ద్వారా చూపించ బోతున్నాడు ఓం రౌత్.ఇక అంత అనుకున్న సమయానికే పూర్తి అవుతుంది కాబట్టి ముందుగా ప్రకటించిన తేదీకే ఈ సినిమా విడుదల కాబోతుంది.ఈ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube