'ఆదిపురుష్‌' కోసం ప్రభాస్‌ వర్కింగ్‌ డేస్‌ ఎన్నో తెలుసా?

ఒక వైపు రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి చేయలేదు ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమాకు అధికారికంగా ఓకే చెప్పాడు.ప్రకటన వచ్చింది హీరోయిన్‌గా బాలీవు్డ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునేను కూడా ఎంపిక చేయడం జరిగింది.

 Prabhas Give The 150 Working Days To  Adi Purush, Prabhas, Remuneration, Adi Pur-TeluguStop.com

వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఆ సినిమాను షూటింగ్‌ మొదలు పెడతామంటూ చాలా నమ్మకంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెబుతున్నాడు.ఇదే సమయంలో భారీ బడ్జెట్‌ మూవీ ‘ఆదిపురుష్‌’ ను కూడా ప్రభాస్‌ కమిట్‌ అయిన విషయం తెల్సిందే.

మూడు సినిమాలను ఇంత తక్కువ సమయంలో చేయడం అది కూడా వందల కోట్ల ప్రాజెక్ట్‌లను ఇంత స్పీడ్‌గా చేయడం సాధ్యమేనా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుండగా అసలు విషయాన్ని క్లారిటీగా చెప్పేందుకు ఆది పురుష్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా కామెంట్స్‌ చేశారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2021 జనవరి నుండి ఆదిపురుష్‌ షూటింగ్‌ జరుగబోతుంది.

ఈ సినిమా షూటింగ్‌ కేవలం 150 రోజులు మాత్రమే జరుగబోతుంది.అందులో ప్రభాస్‌ షూటింగ్‌ లో పాల్గొనబోతున్నది 70 నుండి 80 రోజులు మాత్రమే అంటున్నారు.

సినిమాను జనవరి ఉండి మే వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారట.ఆ తర్వాత కనీసం ఆరు నుండి పది నెలల పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కు సంబంధించిన వర్క్‌ కొనసాగబోతుంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఆదిపురుష్‌ రూపొందించే పనిలో దర్శకుడు ఓం రౌత్‌ ఉన్నాడు.

ప్రభాస్‌ ఆదిపురుష్‌కు గాను వంద కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆయనకున్న క్రేజ్‌ కు అది తక్కువ పారితోషికమే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 70 నుండి 80 రోజుల షూటింగ్‌ లో పాల్గొన్నందుకు గాను ప్రభాస్ తీసుకోబోతున్న పారితోషికం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

ప్రభాస్‌ ఖచ్చితంగా ఆదిపురుష్‌ తో సంచలనంగా నిలవడం ఖాయం అని అందుకే ఆయన కాస్త రిస్క్‌ అయినా ఈ సమయంలో సినిమాకు ఓకే చెప్పాడని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube