రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డు గెలుచుకున్న ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ గా మారిపోవడంతో పాటు అంతర్జాతీయంగా కూడా భాగా ఫేమస్ అయిపోయాడు.బాహుబలి సినిమాని చైనా, జపాన్, రష్యా బాషలలో కూడా రిలీజ్ చేయడంతో అక్కడి ప్రేక్షకులని కూడా బాహుబలి సీరీస్ ఆకట్టుకుంటుంది.

 Prabhas Wins Russian Audience Hearts Award, Bahubali Movie, Tollywood, Bollywood-TeluguStop.com

సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ కి కూడా విదేశీ ఆడియన్స్ పట్టం కట్టారు.ఇప్పుడు రష్యాలో ప్రతిష్టాత్మక అవార్డుని బాహుబలి సినిమాకి గాను ప్రభాస్ గెలుచుకున్నారు.

రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందడంతో, ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డు ప్రభాస్ కు లభించింది.

లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే అవార్డును అందుకున్నారు.

తరువాత ఇప్పటి వరకు ఏ ఇండియన్ నటుడికి ఈ గౌరవం దక్కలేదు.అయితే ఎన్నేళ్ళ తర్వాత ప్రభాస్ కి ఆ అవకాశం దక్కింది.శ్రీ 420, ఆవారా, ఆరాధన వంటి చిత్రాలని రష్యా బాషలో రిలీజ్ చేసి సినీ అభిమానులను మెప్పించి రాజ్ కపూర్ గతంలో ఇదే అవార్డును అందుకున్నారు.2015 అవార్డులను ప్రకటించగా ప్రభాస్ కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. బాహుబలి రికార్డుల పరంపరలో ఇది మరో మైలురాయి.ఈ చిత్రం జీవితానుభూతులను మించిన అనుభూతిని అందిస్తుందని, ముఖ్యంగా క్లయిమాక్స్ సీన్స్ ఒళ్లు జలదరించేలా ఉంటాయని, ఏ సమయంలోనైనా ఈ సినిమాను చూసి ఆనందించవచ్చని ఈ సందర్భంగా అవార్డు కమిటీ వ్యాఖ్యానించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube