ఎవరికీ చెప్పకుండా యుకే చెక్కేసిన ప్రభాస్.. ఎందుకంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం విదితమే.ఇక ఈ సినిమా తర్వాత వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా షూటింగ్ లో కష్టపడుతున్నాడు.

 Prabhas Went To Uk For Health Issue, Prabhas, Adipurush, Om Raut, Uk, Health Iss-TeluguStop.com

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Telugu Salaar, Adipurush, Om Raut, Prabhas, Prabhas Uk, Radhe Shyam-Movie

ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.అయితే ఇప్పుడు రాముడి పాత్ర ప్రభాస్ కు సవాల్ గా మారినట్టు టాక్.ఈ సినిమాలో రాముడి రోల్ విషయంలో డైరెక్టర్ ఓం రౌత్ అసంతృప్తిగా ఉన్నాడట.ఎందుకంటే ప్రభాస్ శరీరంలో కొన్ని మార్పులు రావడంతో ఈ పాత్రకు ఇబ్బందిగా ఉందట.

ప్రభాస్ వెయిట్ మాములకుగా ఉండడం లేదట.తరచుగా వెయిట్ పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతుందట.

అందుకే ఈ సినిమా షూటింగ్ కు ఇబ్బంది అవుతుందట.శరీర బరువు బాలన్స్ గా ఉండక పోవడం వల్ల రాముడి పాత్రకు ఇబ్బందులు వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలా ప్రభాస్ బరువు అనూహ్యంగా పెరగడం లేదంటే తగ్గడం జరగడంతో ఓం రౌత్ యూకే లోని వరల్డ్ క్లాస్ డాక్టర్ వద్దకు పంపించారని తాజాగా సమాచారం అందుతుంది.అందుకే ప్రభాస్ ఎవ్వరికి చెప్పకుండా యూకే చెక్కేశాడని వార్తలు వస్తున్నాయి.

Telugu Salaar, Adipurush, Om Raut, Prabhas, Prabhas Uk, Radhe Shyam-Movie

ప్రభాస్ కు అన్ని టెస్ట్ లు చేసి డైట్ మెయింటైన్ చేసేలా చేయాలనీ ఓం రౌత్ అక్కడికి పంపినట్టు టాక్.ఈ మధ్యనే ప్రభాస్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.అందులో ప్రభాస్ లావుగా దర్శనమిచ్చాడు.దీంతో ఈ వార్తలు నిజమని అభిమానులు నమ్ముతున్నారు.ప్రభాస్ వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తుండడం వల్ల ఇలా జరిగిందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఉందా లేదంటే ఇవన్నీ పుకార్లేనా అనే విషయం ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube