రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చిన ప్రభాస్.. అందుకేనా …   

Hero Prabhas Went to Registrar Office for Car Registration, Prabhas, Tollywood young Rebal Star, Car Registration, Tollywood - Telugu Car Registration, Prabhas, Tollywood, Tollywood Young Rebal Star

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా ప్రభాస్ ఖరీదైన కొత్త కారు ని కొన్నాడు.

 Prabhas Went Rta Office New Car Registration

అయితే ఈ కారు ని తన పేరు మీద రిజిస్టర్ చేయించేందుకు గాను హైదరాబాద్ నగరం లోని ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆర్టిఏ కార్యాలయానికి విచ్చేసాడు.

ఇందులో భాగంగా ఆర్టీఏ అధికారులు తెలిపిన  నియమ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేశాడు.

రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చిన ప్రభాస్.. అందుకేనా … -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే మాస్కు ధరించి ఉన్నటువంటి ప్రభాస్ ని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులు చూసి ఫోటోల కోసం ఎగబడ్డారు.అయినప్పటికీ ప్రభాస్ ఏమాత్రం విసుక్కోకుండా అందరికీ తనతో ఫోటోలు మరియు సెల్ఫీలు తీసుకునే అవకాశం కల్పించాడు.

ఇదంతా గమనిస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేశారు.అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ విపత్కర పరిస్థితులను సైతం లెక్క చేయకుండా తన అభిమానుల కోసం రిస్క్ చేసి మరీ ఫోటోలను తీసుకోవడానికి అనుమతించిన  ప్రభాస్ ని  చూసి రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే కే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ “పూజా హెగ్డే” నటిస్తోంది.

కాగా ఈ చిత్రాన్ని దాదాపుగా నాలుగు భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా  కొంతకాలం పాటు చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పనులను వాయిదా వేశారు.

#Prabhas #TollywoodYoung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Went Rta Office New Car Registration Related Telugu News,Photos/Pics,Images..