మళ్ళీ రాధే శ్యామ్ విషయంలో అదే చేస్తున్న ప్రభాస్ !

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందు నుండి చేసుకున్న ప్లానింగ్స్ అన్ని కరోనా కారణంగా ఆవిరి అయిపోయాయి.సాహో సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్న మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు ప్రభాస్.

 Prabhas Upcoming Movies Latest Update-TeluguStop.com

సాహో సినిమా అయినా వెంటనే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు.

కానీ మధ్యలోనే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది.

 Prabhas Upcoming Movies Latest Update-మళ్ళీ రాధే శ్యామ్ విషయంలో అదే చేస్తున్న ప్రభాస్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే వరస పెట్టి సినిమాలు ప్రకటించాడు.రాధేశ్యామ్ పూర్తి చేయకుండానే మరొక రెండు సినిమాలను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

అయితే కరోనా నుండి కోలుకుంటూ షూటింగ్స్ జరుగుతున్నాయని అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది.

దీంతో మళ్ళీ సినిమాలు వాయిదా పడ్డాయి.

అయితే మళ్ళీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.

Telugu #salaar, Corona Effect, Kgf Director, Pan India Movie, Prabhas, Prabhas Upcoming Movies Latest Update, Prashanth Neel, Radhakrishna, Radhe Shyam, Radheshyam Shooting Update, Tollywood-Movie

రాధేశ్యామ్ సినిమా దాదాపు 80 శాతం మేరకు పూర్తి అయ్యింది.కానీ ఈ సినిమా పూర్తి చెయ్యకుండానే కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

సలార్ సినిమా ఇప్పటికే 30 శాతం మాత్రమే పూర్తి అయ్యింది.

కానీ రాధేశ్యామ్ సినిమా చివరి షెడ్యూల్ చేస్తే సినిమాను థియేటర్స్ కు తీసుకురావచ్చు.

Telugu #salaar, Corona Effect, Kgf Director, Pan India Movie, Prabhas, Prabhas Upcoming Movies Latest Update, Prashanth Neel, Radhakrishna, Radhe Shyam, Radheshyam Shooting Update, Tollywood-Movie

కానీ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను పక్కన పెట్టి సలార్ సినిమాను జులై 1 నుండి స్టార్ట్ చేయబోతున్నాడని వార్తలు అందుతున్నాయి.కానీ ఈ విషయంపై ఫ్యాన్స్ సంతృప్తిగా లేరు.ముందుగా రాధేశ్యామ్ పూర్తి చేస్తే విడుదల చేయవచ్చు.

కానీ ప్రభాస్ మాత్రం అలా ఆలోచించడం లేదనే తెలుస్తుంది.మరి చూడాలి చివరకు రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసి విడుదల చేస్తారో.

#Radhakrishna #Prabhas #PrabhasUpcoming #Prashanth Neel ##Salaar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు