ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ అనౌన్స్ కోసం ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

 Prabhas To Starts For Maruthi S Film , Director Maruti , Prabhas , pakka Commercial , Directed By Maruti , Officially Announced-TeluguStop.com

భారీ అంచనాలతో వచ్చిన సాహో, రాధేశ్యామ్ రెండు కూడా బోల్తా కొట్టడంతో ఇప్పుడు అందరి ఆశలు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపైనే ఉన్నాయి.

ఇప్పుడు ఈయన చేతిలో భారీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ లో కూడా నటిస్తున్నాడు.

అలాగే ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే కూడా షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఈయన మారుతి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నాడు అంటూ కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి.

పాన్ ఇండియా స్టార్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేయడం ఏంటీ అని చాలా మంది ఆశ్చర్య పోయారు.

ఈ కాంబో లో సినిమా ఉంటుంది అని తెలిసింది కానీ అది అధికారికంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనే దానిపై ఎవ్వరికి క్లారిటీ లేదు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి ప్రభాస్ తో చేయబోతున్న సినిమాను 10 మరొక రోజుల్లో అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట.

ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.ఎప్పుడెప్పుడు కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ప్రెసెంట్ మారుతీ గోపీచంద్ హీరోగా యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా రిలీజ్ అయ్యింది.ఈ రోజు గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఇక నెక్స్ట్ ప్రభాస్ సినిమా మీదనే ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడు మారుతి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube