ఆ దర్శకుడితో ప్రభాస్‌‌.. సెట్ అయ్యేనా?  

Prabhas To Do Movie With Trivikram-jaan,prabhas,telugu Movie News,trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలను చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎప్పుడూ థియేటర్లకు పరుగులు పెడతారు.అలాంటి త్రివిక్రమ్‌తో సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలని ప్రతి హీరో ప్రయత్ని్స్తాడు.

Prabhas To Do Movie With Trivikram-jaan,prabhas,telugu Movie News,trivikram-Telugu Gossips Prabhas To Do Movie With Trivikram-jaan Prabhas Telugu News Trivikram-Prabhas To Do Movie With Trivikram-Jaan Prabhas Telugu News Trivikram

కానీ తెలుగులో ఇప్పటివరకు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరకాలేనీ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభాస్ పేరు ఆ జాబితాలో ఉంటుంది.

ఆలిండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సె్స్ అయ్యాడు.

కాగా ఇటీవల సాహో లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో వచ్చిన ప్రభాస్, ఇప్పుడు జాన్ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.జాన్ సినిమా తరువాత ప్రభాస్ మళ్లీ పాన్ ఇండియా సినిమా చేస్తాడా, లేక మరో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

కానీ ప్రభాస్‌కు మాత్రం ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా చేయాలనుందట.

తన సన్నిహితులతో ప్రభాస్ ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న ఓ బడా నిర్మాత ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అయిన త్రివిక్రమ్‌తో ప్రభాస్‌ను హీరోగా పెట్టి సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఆ బడా నిర్మాత ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

తాజా వార్తలు