ప్రభాస్ కూడా రెడీ అవుతున్నాడు.. ఇక ఆగడం కష్టమే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సాహో తరువాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

 Prabhas To Complete Three Movie Shootings This Time, Prabhas, Salaar, Adipurush,-TeluguStop.com

అయితే ప్రభాస్ మాత్రం ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి పట్టాలెక్కించే పనిలో పడ్డాడు.ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే భారీ యాక్షన్ మూవీని తెరకెక్కి్స్తున్నాడు.ఈ మూడు సినిమాలు పూర్తికాకముందే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని ఎప్పుడో అనౌన్స్ చేశాడు.

ఈ క్రమంలో ప్రభాస్ ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తాడా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది.అటు కరోనా కారణంగా గతేడాది నుండి సినిమా షూటింగ్‌లు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి.

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.

దీంతో ప్రభాస్ వరుసగా సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.

అయితే సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో, త్వరలోనే సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించాలని పలువురు దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా త్వరలో తన చిత్రాలను స్టార్ట్ చేయాలని, అయితే ఈసారి ఏకంగా మూడు సినిమాలను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని గట్టిగా అనుకుంటున్నాడట.

దీంతో ప్రభాస్ షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడమే తన స్పీడును చూపించేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఒకవేళ ఇదే నిజం అయితే ఇక ప్రభాస్ స్పీడును ఆపడం ఎవరి తరమూ కాదనేది వాస్తవం.

మరి ప్రభాస్ నిజంగానే మూడు సినిమాలను అనుకున్నట్లుగానే పూర్తి చేస్తాడా లేడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube