సౌత్ ఇండియాలో ఒకే ఒక్కడు ప్రభాస్  

Prabhas The Only One From South India, Prabhas, Prabhas 20, Radhe Shyam, Facebook, Tollywood News - Telugu Facebook, Prabhas, Prabhas 20, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడు.

 Prabhas The Only One From South India

ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక తాజాగా ప్రభాస్ ఓ సరికొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.

సహజంగానే ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ప్రభాస్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు.దీంతో అతడి ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇటీవల ఏకంగా 14 మిలియన్ ఫాలోవర్స్‌ను అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన ప్రభాస్, ఇప్పుడు మరో మైలురాయిని చేరాడు.

సౌత్ ఇండియాలో ఒకే ఒక్కడు ప్రభాస్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మరో మిలియన్ మంది ఫాలోవర్స్‌ను సంపాధించిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు.ఇలాంటి ఫీట్ సాధించిన టాలీవుడ్ తొలి హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు.

అంతేగాక యావత్ సౌత్ ఇండియాలో ఈ ఘనత సాధించిన ఒకేఒక్క హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు.మరి ప్రభాస్ నెలకొల్పిన ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.

ఇక రాధేశ్యామ్ చిత్రాన్ని పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌తో తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

#Prabhas #Facebook #Radhe Shyam #Prabhas 20

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas The Only One From South India Related Telugu News,Photos/Pics,Images..