అభిమానికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. ఏం జరిగిందంటే?

సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఈ క్రమంలోనే వారికి నచ్చిన వారి అభిమాన హీరో హీరోయిన్లను కలుసుకోవడం, వారితో సెల్ఫీదిగడం, వారితో కలిసి మాట్లాడాలనే ఎన్నో కోరికలు ఉంటాయి.

 Young Rebel Star Prabhas Video Call With Fan Who Admitted In Hospital,  Rebel St-TeluguStop.com

ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి సదరు అభిమాని ఎంతో ఆతృత, ఆసక్తి చూపిస్తుంటారు.అలాగే కొంతమంది వారి అభిమాన తారలను కలుసుకోవడం కోసం ఏకంగా కొన్ని సాహసాలు చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఈ విధంగానే ఒక అభిమానికి ఏకంగా ప్రభాస్ తో మాట్లాడాలనే కోరిక ఉందని తెలియడంతో ఆ అభిమాని కోరికను తెలుసుకున్న ప్రభాస్ ఏకంగా ఆమెకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైస్ చేశారు.మరి ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే…

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొంది ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.“ఆదిపురుష్‌”, ‘సలార్‌’ షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్‌.ఇటీవలి కాలంలో మీడియాకు కాస్త దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ తన అభిమాని కోసం ఏకంగా వీడియో కాల్ చేసే తనతో మాట్లాడుతూ తనకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.అసలు ప్రభాస్ తన అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడటానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.

Telugu Prabhas, Prabhas Fan, Rebel Prabhas, Salaar, Tollywood, Youngrebel-Movie

ప్రభాస్ అభిమాని అయినటువంటి శోభిత అనే ఒక అమ్మాయి గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతోంది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్న శోభితకి తన ఇష్టాయిష్టాలు ఏమిటో డాక్టర్ల తెలుసుకో గా తనకు తన అభిమాన నటుడు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, తనతో మాట్లాడాలనే కోరిక తనలో ఎప్పటినుంచో ఉందని తెలియజేయడంతో ఆమె కోరిక తీర్చడం కోసం వైద్యులు ఎంతో కష్టపడి ఏకంగా ప్రభాస్ తో తన అభిమాని శోభిత కు ఫోన్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలోనే శనివారం తన అభిమాని శోభితకు ప్రభాస్ వీడియో కాల్ చేసి మాట్లాడటంతో శోభితా ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube