ప్రభాస్‌ ముంబయికి షిప్ట్‌ అవ్వడం కోసం ప్లాన్స్‌, రూ.75 కోట్లు ఖర్చు?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు కేవలం తెలుగు సినిమా హీరోనో లేదా సౌత్ స్టార్‌ హీరోనో కాదు.ఆయన ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌.

 Prabhas Take A Big House In Mumbai For His Next Bollywood Projects-TeluguStop.com

భారీ చిత్రాల దర్శకులకు ఆయన మోస్ట్‌ వాంటెడ్‌ అనడంలో సందేహం లేదు.బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ కూడా ఆయన్ను పెద్ద సినిమాల కోసం అప్రోచ్‌ అవుతున్నారు.

ఇలాంటి సమయంలో ఆయన బాలీవుడ్‌ లో కంటిన్యూగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.ఒక వైపు టాలీవుడ్ సినిమాలు మరో వైపు బాలీవుడ్ సినిమాలు చేసేందుకు కమిట్‌ అవుతున్న ప్రభాస్ ముంబయిలో ఎక్కువగా స్పెండ్‌ చేయాల్సి వస్తుందట.

 Prabhas Take A Big House In Mumbai For His Next Bollywood Projects-ప్రభాస్‌ ముంబయికి షిప్ట్‌ అవ్వడం కోసం ప్లాన్స్‌, రూ.75 కోట్లు ఖర్చు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ముంబయిలో ఒక విలాసవంతమైన అపార్ట్‌ మెంట్‌ లో ప్లాట్‌ ను ప్రభాస్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్లాట్ కోసం ప్రభాస్ ఏకంగా రూ.75 కోట్లను ఖర్చు చేశాడట.

సినిమాలతో చాలా బిజీగా ఉన్న ప్రభాస్‌ ఒక్కో సినిమాకు 50 నుండి 100 కోట్ల వరకు కూడా పారితోషికంను తీసుకుంటున్నాడు.

అందుకే ఇంత భారీ మొత్తం పెట్టి మరీ ప్లాట్ ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఈ విషయమై ప్రభాస్‌ సన్నిహితుల నుండి రకరకాలుగా ప్రకటనలు వస్తున్నాయి.

యూవీ క్రియేషన్స్‌ ఆఫీస్‌ ను కూడా ముంబయిలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ప్లాట్‌ ను కొనుగోలు చేశారట.ప్రభాస్‌ కు మరియు యూవీ క్రియేషన్స్‌ కు రెండు విధాలుగా వినియోగించేందుకు ఆ ప్లాట్ ను డిజైన్‌ చేయించారు.

ఇంటీరియర్ కోసం ప్రభాస్‌ భారీ మొత్తంను ఖర్చు చేరారు అంటూ టాక్ వినిపిస్తుంది.ఆది పురుష్‌ సినిమా కోసం ప్రభాస్ ప్రస్తుతం ముంబయిలోనే ఉన్నాడు.వచ్చే ఏడాదిలో కూడా మరో హిందీ సినిమా ను చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు.

Telugu 75 Crores, Adipurush, Bollywood, Flat, Prabhas House In Mumbai, Radheshyam, Salaar Movie, Telugu Film News-Movie.

#Flat #Radheshyam #Adipurush #PrabhasHouse #75 Crores

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు