చాలా రోజుల గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేయబోతున్న డార్లింగ్ !

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు.

 Prabhas Starts Radheshyam Shooting After Long-TeluguStop.com

ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.ఇక ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

 Prabhas Starts Radheshyam Shooting After Long-చాలా రోజుల గ్యాప్ తర్వాత సినిమా స్టార్ట్ చేయబోతున్న డార్లింగ్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి.

Telugu Covid-19, Prabhas, Prabhas Starts Radheshyam Shooting After Long Time, Radheshyam, Shooting-Movie

ఇప్పుడిప్పుడే అన్ని నార్మల్ అవుతున్న సమయంలో ప్రభాస్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడని టాక్.అయితే ప్రభాస్ ముందుగా రాధే శ్యామ్ సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే మిగతా సినిమాల కంటే ఈ సినిమా కొద్దీ భాగం మాత్రమే బాలన్స్ ఉంది.

ఈ సినిమా కొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే ఉందని చిత్ర యూనిట్ ఎప్పటి నుండో చెబుతున్న మాట.

అందుకే ముందుగా ఈ సినిమా పూర్తి చేస్తే ఇక ఆ తర్వాత ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలను ఒకే సారి పూర్తి చేయాలనీ భావిస్తున్నాడు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.కానీ అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదా మరొకసారి వాయిదా పడుతుందో ముందుముందు చూడాలి.

#Prabhas #PrabhasStarts #COVID-19 #Shooting #Radheshyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు