సాహో నుంచి ఊహించని ట్విస్ట్! ఆందోళనలో ఫాన్స్  

Prabhas Starrer Saaho Movie Release Postponed-

బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో.సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఫైనల్ గా గుమ్మడికాయ కొట్టేసి షూటింగ్ ముగించేసారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఇందులో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేసాడు.

Prabhas Starrer Saaho Movie Release Postponed- Telugu Tollywood Movie Cinema Film Latest News Prabhas Starrer Saaho Movie Release Postponed--Prabhas Starrer Saaho Movie Release Postponed-

ఈ నేపధ్యంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది.ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతతో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఏడాది క్రితమే ప్రకటించింది.మరో సారి కొద్ది రోజుల క్రితం కూడా స్పష్టం చేసింది.

అయితే ఊహించని విధంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ సినిమా స్థానాన్ని యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రణరంగం చిత్రం ఆక్రమిస్తోంది.నిజానికి ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కావాల్సి ఉంది.కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా రణరంగం విడుదలను చిత్రబ‌ృందం ఆగస్ట్ 15కు వాయిదా వేసింది.ఈ చిత్రంతో పాటు అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఎవరు సినిమా కూడా విడుదల కాబోతోంది.

మరో వైపు ఆగష్టు 15న బాలీవుడ్ నుంచి మిషన్ మంగళయాన్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.ఈ నేపధ్యంలో సాహో మూవీ వాయిదా పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.