స్టార్ హీరో ప్రభాస్ కు జోడీగా శ్రీలీల.. ఈ గ్లామర్ బ్యూటీ జాతకాన్ని డిసైడ్ చేసే మూవీ ఇదేనంటూ?

కృతిశెట్టి, శ్రీలీల వరుస విజయాలతో మంచి పేరును సొంతం చేసుకుని తర్వాత రోజుల్లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేక కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల( Sreeleela )కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేవనే సంగతి తెలిసిందే.

 Prabhas Sreeleela Combo  News Hot Topic In Social Media Details Here ,prabhas, S-TeluguStop.com

అయితే ఎవరూ ఊహించని ఆఫర్ ఈ బ్యూటీ తలుపు తట్టిందని తెలుస్తోంది. ప్రభాస్( Prabhas ) హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా సీతారామం తర్వాత హను రాఘవపూడి( Director Hanu Raghavapudi ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

Telugu Prabhas, Sreeleela-Movie

శ్రీలీల జాతకాన్ని డిసైడ్ చేసే సినిమా ఇదే అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ సినిమాలన్నీ కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ప్రభాస్ శ్రీలీల( Prabhas Sreeleela ) జోడీ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హను రాఘవపూడి సినిమాలలో హీరోయిన్లకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హను రాఘవపూడి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే మరి కొందరు స్టార్ హీరోలు ఆయనకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.

శ్రీలీల కొన్ని ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Prabhas, Sreeleela-Movie

కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే అభినయ ప్రధాన పాత్రల్లో నటించడం వల్ల శ్రీలీల కెరీర్ కు ప్లస్ అవుతుంది.శ్రీలీల రెమ్యునరేషన్( Sreeleela Remuneration ) సైతం పరిమితంగానే ఉందని వరుస ఫ్లాపుల వల్ల ఆమె ఎక్కువ మొత్తం డిమాండ్ చేయడం లేదని తెలుస్తోంది.2024 సంవత్సరంలో శ్రీలీలకు విజయాలు దక్కుతాయో లేదో చూడాలి.ప్రభాస్ వేగంగా సినిమాలలో నటిస్తుండగా హను రాఘవపూడి సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube