రేపు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన ప్రభాస్‌.. ఏంటో అది?  

Prabhas Shoo Movie News-prabhas,sahoo,sujith,ప్రభాస్,బాహుబలి 2

బాహుబలి 2 చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రభాస్‌ తర్వాత సినిమాకు సంబంధించిన విడుదలపై క్లారిటీ రాలేదు. గత రెండేళ్లుగా సాహోను దిద్దుతూనే ఉన్నారు. సాహో చిత్రం హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ సీన్స్‌తో చిత్రీకరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ వారు ఏకంగా 250 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. సుజీత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది..

రేపు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన ప్రభాస్‌.. ఏంటో అది?-Prabhas Shoo Movie News

ఈ చిత్రంకు సంబంధించిన విడుదల తేదీ విషయమై గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌ నెలకొంది.

మొదట ఆగస్టు 15న సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే అదే తేదీన చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంను విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సైరా విడుదల తేదీలో మార్పు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సైరా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు యూనిట్‌ సభ్యులు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.

నేడు మద్యాహ్నం 12 గంటల సమయంలో యూవీ క్రియేషన్స్‌ వారు ప్రభాస్‌ 10 సెకన్ల వీడియోను విడుదల చేయడం జరిగింది.

ఆ వీడియోలో ప్రభాస్‌ హాయ్‌, రేపు మీకు ఒక సర్‌ప్రైజ్‌ అంటూ ప్రకటించాడు. సాహోకు చెందిన సర్‌ప్రైజ్‌ అని అంతా అనుకుంటున్నారు. సాహో చిత్ర విడుదల తేదీ ప్రకటించడంతో పాటు, టీజర్‌ లేదా మరేదైనా మేకింగ్‌ వీడియోకు సంబంధించిన విడుదల తేదీని కూడా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సాహో చిత్రంకు సంబంధించిన భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతున్నాయి.