సాహో నుంచి ఏదో ట్విస్ట్ అనుకుంటే సింపుల్ గా తేల్చేసాడు  

సాహో మూవీ న్యూ లుక్ ని రిలీజ్జ్ చేసిన ప్రభాస్. .

Prabhas Share Sahoo Movie New Poster Look-prabhas,sahoo Movie New Poster Look,tollywood,uv Creations

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం సాహో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. అయితే సినిమా గురించి ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా సీరియస్ లో సోషల్ మీడియాలో దర్శకుడు సుజిత్ ని ట్రోల్ చేసారు. దీంతో తన ఫ్యాన్స్ నుంచి దర్శకుడుని సేవ్ చేయడానికి ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు..

సాహో నుంచి ఏదో ట్విస్ట్ అనుకుంటే సింపుల్ గా తేల్చేసాడు-Prabhas Share Sahoo Movie New Poster Look

ప్రభాస్ అలా చెప్పేసరికి సాహోకి సంబంధించిన ఏదైనా వీడియో రిలీజ్ చేస్తారేమో అని ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా ప్రభాస్ సాహో సినిమా నుంచి అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేసి చాలా హోప్స్ పెట్టుకున్న ఫాన్స్ గాలి తీసేశారు. అయితే డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపించడంతో ఫాన్స్ కాస్తా సంతృప్తి వ్యక్తం చేసిన.

పోస్టర్ చాలా సింపుల్ గా ఉంది అనే టాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలోకి వచ్చిన కొద్దిసేపటికి విస్తృతంగా వైరల్ కావడం విశేషం.