ప్రభాస్‌కు ఎందుకు ఇంత విరక్తిగా ఉంది?       2018-06-22   05:55:48  IST  Raghu V

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘మిర్చి’ చిత్రం విడుదలై దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది. ఈ ఏడు సంవత్సరాల్లో ప్రభాస్‌ కేవలం ‘బాహుబలి’ రెండు పార్ట్‌లతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి 2 విడుదలై సంవత్సరం గడిచినా కూడా ప్రభాస్‌ తదుపరి చిత్రం రాలేదు. మరో సంవత్సరం అయితే తప్ప ప్రభాస్‌ తదుపరి చిత్రం ‘సాహో’ విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడు సంవత్సరాలుగా సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్న ప్రభాస్‌కు సినిమాలు అంటేనే విరక్తి పుడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

‘బాహుబలి’ కోసం రాజమౌళి దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపెడితే ప్రస్తుతం ‘సాహో’ కోసం దర్శకుడు సుజీత్‌ చుక్కలు చూపిస్తున్నాడు. భారీ యాక్షన్‌ సీన్స్‌ అని, పెద్ద పెద్ద ఛేజింగ్‌ సీన్స్‌ అంటూ దర్శకుడు సుజీత్‌ వామ్మో అనిపిస్తున్నాడు. కోట్లకు కోట్లు పెట్టి సుజీత్‌ యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్న సమయంలో ఖచ్చితంగా డూప్‌ లేకుంటేనే బాగుంటుందనే అభిప్రాయంతో ప్రభాస్‌ సొంతంగానే రిస్క్‌ షాట్లు చేస్తున్నాడు. ఇంతగా కష్టపడుతున్న సాహో సినిమా ఇంకా సంవత్సరం అయినా పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఒక జాతీయ మీడియాకు ప్రభాస్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ప్రభాస్‌ వెళ్లడి చేయడం జరిగింది. ‘సాహో’ చిత్రం తర్వాత మీరు చేయబోతున్న ప్రాజెక్ట్‌ ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో తాను వ్యవసాయం లేదా వ్యాపారం చేయానుకుంటున్నాను. సినిమాల కంటే అవి చాలా ఈజీ అంటూ ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. తాను చేస్తున్న సినిమాల విషయంలో ప్రభాస్‌ సంతృప్తిగా లేకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నాడు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలపై ఇష్టం లేకుంటే ప్రభాస్‌ ఎలా అంతగా కష్టపడుతాడు అంటూ కొందరు అంటున్నారు. అయితే ఎంతటి వ్యక్తికి అయినా ఒక పని వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పుడు, దాన్ని మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తున్నప్పుడు ఖచ్చితంగా విరక్తి అనేది కలుగుతుంది. అదే ఇప్పుడు ప్రభాస్‌ పరిస్థితి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న ‘సాహో’ చిత్రం విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు. తదుపరి చిత్రంగా జిల్‌ దర్శకుడు రాధాకృష్ణతో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా ఒక చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం విరక్తితో ప్రభాస్‌ అలాంటి వ్యాఖ్యలు చేశాడు కాని, హీరోగా చేయకుండా ఎలా ఉంటాడు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.