'సలార్'పై ఆసక్తికర టాక్.. కేజిఎఫ్ రికార్డ్స్ ను బ్రేక్ చేయనుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘సలార్‘ ఒకటి.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

 Prabhas Salaar Will Break All Records Of Kgf 2, Kgf 2, Prabhas, Salaar, Prashant-TeluguStop.com

కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.కెజిఎఫ్ రెండు పార్ట్శ్ కూడా నార్త్ మేకర్స్ ను అమితంగా ఆకట్టుకుంది.

మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ మరింత విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ పేరు మారుమోగి పోయింది.ఇక ఇలాంటి భారీ హిట్ తర్వాత నీల్ చేస్తున్న సినిమా సలార్ కావడంతో ఈ సినిమాపై కూడా మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.

సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.అయితే ఈ సినిమా గురించి అప్పుడే ఆసక్తికర చర్చ స్టార్ట్ అయ్యింది.

Telugu Salaar, Kgf, Prabhas, Prabhassalaar, Prashanth Neel, Shruti Haasan-Movie

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తుంది.కెజిఎఫ్ ను మించి ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటూ ఆసక్తికరంగా అంతా చర్చించు కుంటున్నారు.ఇలా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వకపోయినా ఏదొక వార్తతో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

Telugu Salaar, Kgf, Prabhas, Prabhassalaar, Prashanth Neel, Shruti Haasan-Movie

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్ వంటి సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.ఇక డార్లింగ్ ఈ సినిమాతో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి సినిమాలను చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube