250 రోజుల్లో 'సలార్'.. వాయిదా పడే ఛాన్సే లేదంటున్న టీమ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఏ హీరోకు లేనంతగా స్టార్ డమ్ దక్కించుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.ఈయన బాహుబలి సినిమాతో భారీ హిట్ అందుకుని ఆ తర్వాత స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడు.

 Prabhas' Salaar New Release Date Out, Prabhas, Salaar, Salaar Update,shruti Haas-TeluguStop.com

ప్రెజెంట్ ఈయన చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాలు అన్ని కూడా ప్రెజెంట్ సెట్స్ మీద శరవేగంగా షూట్ జరుపు కుంటున్నాయి.

ఇక సలార్ విషయానికి వస్తే.ఈ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ప్రశాంత్ నీల్ రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరంగుదురు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Telugu Salaar, Adipurush, Prabhas, Prabhas Fans, Prashant Neel, Project, Shruti

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కరోనా కారణంగా షూట్ ఆలస్యం అవుతూ వస్తుంది.ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 2022 లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు.ఇలా షూట్ ఆలస్యం అవుతూ వస్తుండడంతో ఈ సినిమాను 2023 ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని నిర్ణయించు కున్నారు.

సరిగ్గా ఈ రోజుకు సెప్టెంబర్ 28వ తారీకుకు 250 రోజులు ఉన్నాయి.

Telugu Salaar, Adipurush, Prabhas, Prabhas Fans, Prashant Neel, Project, Shruti

ఈ సినిమా ఈ డేట్ కు కూడా వాయిదా పడుతుంది అని కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదు అని మేకర్స్ ఈ అప్డేట్ ఇచ్చి కన్ఫర్మ్ చేసేసారు.యూనిట్ సభ్యులు ఖచ్చితంగా 250 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఒక అప్డేట్ రిలీజ్ చేసారు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా వాయిదా పడదు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube