కేజిఎఫ్ రూట్ లోనే సలార్.. నీల్ ఏం ఆలోచిస్తున్నాడంటే ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.

 Prabhas Salaar Movie To Be Made In Two Parts-TeluguStop.com

అందులో కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా ఒకటి.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 Prabhas Salaar Movie To Be Made In Two Parts-కేజిఎఫ్ రూట్ లోనే సలార్.. నీల్ ఏం ఆలోచిస్తున్నాడంటే -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈ సినిమాపై కొన్ని వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అది ఏంటంటే.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా కెజిఎఫ్ సినిమాలాగే రెండు పార్టులుగా విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మన తెలుగులో ఇప్పటికే బాహుబలి సినిమా రెండు భాగాలుగా విడుదల అయ్యింది.అదే బాటలో అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా రెండు పార్ట్ లుగా రాబోతుందని ఈ మధ్యనే మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

Telugu Prabhas, Prabhas Salaar Movie To Be Made In Two Parts, Prashanth Neel, Salaar Movie, Shruti Haasan, Two Parts-Movie

ఇప్పుడు సలార్ సినిమా కూడా అదే బాటలో రాబోతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తుంది.ఈ విషయంపై ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.ప్రభాస్ అంగీకరిస్తే సలార్ సినిమా రెండు భాగాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అలా వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇది ఇలా ఉంటే సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాను ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.

ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, అలాగే నాగ్ అశ్విన్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

#Prashanth Neel #Shruti Haasan #Two Parts #PrabhasSalaar #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు