పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న సలార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం చకచక జరుగుతున్నాయి.
ఇటీవలే హైదరాబాద్ లో నైట్ షెడ్యూల్ ను నిర్వహిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో నిర్వహిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
ముందుగా అనుకున్న ప్రకారం నిన్నటితో ఆ షెడ్యూల్ పూర్తి అవ్వాల్సి ఉంది.కాని ముందు ముందు మళ్లీ వర్షాలు ప్రారంభం అయితే ఇబ్బంది అనే ఉద్దేశ్యంతో మరో షెడ్యూల్ లో నిర్వహించాల్సిన ఔట్ డోర్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్ లోనే ముగించాలని ప్రశాంత్ నీల్ భావించాడట.
ప్రభాస్ ఇతర సినిమా షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయ్యిందని.అందుకే ఈ సినిమాను మరో వారం రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ మూవీని తెరకెక్కించి ప్రస్తుతం కేజీఎఫ్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సలార్ ను భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు.హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో పాటు కీలక నటీ నటులు నటిస్తున్నారు.
సలార్ షెడ్యూల్ ను ముగించిన తర్వాత ప్రభాస్ ఆది పురుష్ సినిమా షూట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న ఆది పురుష్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.రాధే శ్యామ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఆదిపురుష్ ఆగస్టులో రాబోతుంది.ఇక సలార్ ను సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
నాగ్ అశ్విన్ మూవీ 2023 లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.